బంగారం ధరల అనిశ్చితి: తగ్గుతాయా? పెరుగుతాయా? నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
భారతదేశంలో బంగారం ధరలలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. విపరీతంగా బంగారం ధరలు పెరగడం, ఆపై కొద్దిగా బంగారం ధరలు తగ్గడం నిత్యకృత్యంగా మారింది. బంగారం ధరలు 60 వేల రూపాయల మార్కును చేరుకుంటాయని గత కొంతకాలంగా చెబుతున్నదే నిజమైంది. ప్రస్తుతం 60 వేలను దాటి కొనసాగుతున్న బంగారం ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితిని తీసుకువచ్చాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు నేడు కూడా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలో ఈ రోజు బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 55,800గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 60,870 రూపాయలుగా ట్రేడ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్లో నేడు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 55,800గా ట్రేడ్ అవుతుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60, 870 రూపాయలుగా విక్రయించబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రధాన నగరాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 950 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 020 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక బెంగళూరులో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 55,850 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 60 వేల 920 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి బంగారం ధరలలో తగ్గుదల పెద్దగా ఉంటుంది అన్న భావన నిపుణులలోను వ్యక్తం కావడం లేదు.
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు నేపథ్యంలో బంగారం ధరలలో గణనీయంగా మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. బంగారం ధర 70 వేల రూపాయలకు చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చెబుతున్న పరిస్థితి ఉంది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులతో పాటు, గత కొంతకాలంగా బంగారం ధరల ట్రెండ్ ఈ అనుమానానికి కారణంగా మారింది.


Click it and Unblock the Notifications