Gold Price Today: పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో ఈరోజు స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. పసిడి ధర పెరగగా, వెండి ధర క్షీణించింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.5,000కు పైగా తక్కువ పలుకుతోంది. గత నెల రోజులుగా బంగారం ధరలు రూ.49,500 నుండి రూ.51వేల మధ్య స్థిరంగా ఉన్నాయి. దీంతో సేల్స్ పెరుగుతాయని నగల వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. దీనికి పండుగ సీజన్ తోడయింది. దీంతో దీపావళి నాటికి సేల్స్ మరింతగా ఉంటాయని భావిస్తున్నారు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు రూ.100కు పైగా పెరిగింది. వెండి రూ.200కు పైగా క్షీణించింది.

రూ.150 పెరిగిన బంగారం ధర
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.150 (0.30 శాతం) పెరిగి రూ.50,989 పలికింది. రూ.50,690.00 వద్ద ప్రారంభమైన పసిడి రూ.51,125 వద్ద నేటి గరిష్టాన్ని రూ.50,552 వద్ద నేటి కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.51వేలు క్రాస్ అయింది. రూ.139 (0.27 శాతం) పెరిగి 10 గ్రాములు రూ.51,065 పలికింది. రూ.50,810.00 ప్రారంభం కాగా, రూ.51,202.00 వద్ద నేటి గరిష్టాన్ని, రూ.50,669.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర తగ్గుదల
బంగారం ధర పెరగగా, వండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.299 (0.48 శాతం) తగ్గి రూ.62,150 పలికింది. రూ.61,720.00 వద్ద ప్రారంభమై, రూ.62,480.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,251.00 కనిష్టాన్ని తాకింది. మార్చి ఫ్యూచర్స్ రూ.307 (0.48 శాతం) పెరిగి రూ.63,870కు తగ్గింది. రూ.63,506.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,170.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,059.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

గ్లోబల్ మార్కెట్లోను అదే తీరు
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్ పసిడి 0.01 శాతం 1,905.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 1,892.60 -1,911.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1905.20 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. పసిడి ఏడాదిలో 24 శాతం పెరిగింది.
ఇక వెండి 0.82 శాతం తగ్గి ఔన్స్ 24.473 డాలర్లు పలికింది. నేడు 24.150 - 24.740 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.733 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి ధర 35 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications