దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు పెరిగాయి. ఉదయం ఓ సమయంలో స్వల్పంగా తగ్గిన బంగారం సాయంత్రం సమయానికి పెరిగింది. గతవారం దాదాపు స్థిరంగా ఉన్న ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.5,200 తక్కువ పలుకుతోంది. నేడు (నవంబర్ 2) దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.255 (0.50 శాతం) పెరిగి రూ.50,954 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం రూ.50,777 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,000 వద్ద గరిష్టాన్ని, రూ.50,612 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.250కి పైగా పెరిగిన పసిడి
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.255 పెరగగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.281 (0.55 శాతం) పెరిగి రూ.51,085 పలికింది. గతవారం రూ51,000 దిగువకు వచ్చిన పసిడి ఇప్పుడు ఈ మార్క్‌ను దాటింది. రూ.50,781.00 ప్రారంభం కాగా, రూ.51,100.00 గరిష్టాన్ని, రూ.50,740.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7న పసిడి ధరలు రూ.56,200ను తాకిన విషయం తెలిసిందే. ఈ ఏఢాది పసిడి ధరలు 30 శాతం వరకు పెరిగాయి.

వెండి ధరలదీ అదే దారి
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.706(1.16 శాతం) పెరిగి రూ.61,571 పలికింది. రూ.61,422.00 ప్రారంభం కాగా, రూ.62,272.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,330.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.571 (0.91 శాతం) పెరిగి రూ.63,015 పలికింది. రూ.63,187.00 వద్ద ప్రారంభమై, రూ.63,818.00 వద్ద గరిష్టాన్న, రూ.62,914.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడా పెరిగిన బంగారం, వెండి
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.82 శాతం పెరిగి 1,895.35 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది. 1,873.55 - 1,896.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. పసిడి ఈ ఏడాది 21.83 శాతం పెరిగింది. వెండి ధర ఔన్స్ 1.32 శాతం పెరిగి 23.957 డాలర్లు పలికింది. 23.462 - 24.253 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. వెండి ఏడాదిలో 28.82 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications