Gold prices today: మూడ్రోజుల్లో రూ.1,350 పెరిగిన బంగారం, వెండి 62,000 క్రాస్
బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. మొన్న రూ.700, నిన్న రూ.575 పెరిగిన బంగారం ధరలు గురువారం(డిసెంబర్ 3) ప్రారంభ సెషన్‌లో రూ.200కు పైగా పెరిగింది. అంటే మూడు రోజుల్లో దాదాపు రూ.1350 పెరిగింది. వెండి ధరలు కూడా మూడు రోజుల్లో దాదాపు రూ.4,000 వరకు పెరిగింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7,350 తక్కువ పలికింది. వెండి కిలో ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో రూ.16వేలకు పైగా తక్కువ ఉంది. ఇటీవల రూ.48,000 దిగువకు వచ్చిన పసిడి ధరలు తిరిగి రూ.49,000 సమీపానికి చేరుకున్నాయి.
వ్యాపారులకు పేటీఎం అదిరిపోయే న్యూస్, ఆ ఛార్జీలు రద్దు

రూ.1400 పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.206.00 (0.42%) పెరిగి రూ.48,849.00 వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.213.00 (0.44%) పెరిగి రూ.49,160.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,147.00 ప్రారంభమై, రూ.49,270.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,136.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ మూడు రోజుల్లో రూ.1350 వరకు పెరిగింది.
నిన్న 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.574.00 ఎగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.403.00 (0.83%) పెరిగి రూ.48,970.00 వద్ద క్లోజ్ అయింది.

రూ.4వేలు పెరిగిన వెండి
నేడు డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.447.00 (0.72%) పెరిగి రూ.62600.00 వద్ద ట్రేడ్ అయింది. మార్చి ఫ్యూచర్స్ రూ.285.00 (0.45%) పెరిగి రూ.63610.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,638.00 ప్రారంభమై, రూ.63,860.00 గరిష్టాన్ని, రూ.63,580.00 కనిష్టాన్ని తాకింది. రూ59వేల దిగువకు వచ్చిన వెండి ఇప్పుడు రూ.63,600 పైకి చేరుకుంది. దాదాపు రూ.4వేల వరకు పెరిగింది.
నిన్న కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.448.00 (0.72%) పెరిగింది. మార్చి ఫ్యూచర్స్ రూ.174.00 (0.28%) పెరిగి రూ.63,372.00 వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో జంప్
క్రితం సెషన్లో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 7.75 (+0.42%) డాలర్లు పెరిగి 1,837.95 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. సెషన్లో 1,829.05 - 1,840.65 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,830.20 డాలర్ల వద్ద ముగియగా, ఏడాదిలో 21.48 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.072 (+0.30%) డాలర్లు పెరిగి 24.157 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. సెషన్లో 23.955 - 24.242 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో 24.080 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 38.26 శాతం పెరిగింది.