For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాలో తెరుచుకుంటున్న కంపెనీలు, తగ్గుతున్న బంగారం ధర

|

బంగారం ధరలు మంగళవారం నాడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.38,980కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.42,530 వద్ద స్థిరంగా ఉంది. వెండి ధర కిలోకు రూ.300 వరకు పెరిగింది.

ఇక, ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు 0.6 శాతం తగ్గి రూ.40,455 గా ఉంది. నాలుగు రోజుల తర్వాత బంగారం ధర తగ్గింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి 0.4 శాతం తగ్గి రూ.46,032గా ఉంది. గత నాలుగు సెషన్లలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.700 వరకు పెరిగింది. అమెరికా డాలర్‌తో రూపాయి విలువ 71.25 వద్ద ఉండటం బంగారంపై ప్రభావం ఉంటుంది.

 Gold prices today fall sharply after rising for four days

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,570.98 డాలర్ల వద్ద ఉంది.గత సెషన్‌లో పసిడి ధర ఇక్కడ వారంలో రికార్డ్ ధరను నమోదు చేసింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో సురక్షిత బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. దాదాపు వెయ్యి మంది వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. గత వారం పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఇతర అతి ఖరీదైన లోహాలు పల్లాడియం ఔన్స్‌కు 2,353 డాలర్లుగా, వెండి ఔన్స్‌కు 17.75గా ఉంది.

చైనాలో మంగళవారం కొన్ని ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. దీంతో బంగారానికి డిమాండ్ కాస్త తగ్గింది. బంగారంతో పాటు వెండి ఫ్యూచర్స్ ధరలు భారత్‌లో స్వల్పంగా తగ్గాయి. కరోనా వైరస్ కారణంగా చైనాలో పరిశ్రమలు మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడు తెరుచుకుంటుండటంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది.

English summary

చైనాలో తెరుచుకుంటున్న కంపెనీలు, తగ్గుతున్న బంగారం ధర | Gold prices today fall sharply after rising for four days

Gold and silver prices fell in India today tracking a firmer rupee and muted global prices. On MCX, gold prices fell sharply by 0.6% to ₹40,455 per 10 gram, their first decline in four days. Tracking gold, silver futures on MCX also declined 0.4% to ₹46,032 per kg.
Story first published: Tuesday, February 11, 2020, 14:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X