For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా రెండో రోజు... భారీగా తగ్గిన బంగారం ధర, హైదరాబాద్‌లో ఎంతంటే?

|

బంగారం ధరలు సోమవారం తగ్గాయి. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.62 శాతం తగ్గి రూ.43,886 వద్ద ఉంది. అంతకుముందు రూ.44,777 వరకు చేరుకుంది. గత సెషన్‌లో (శుక్రవారం) బంగారం ధర రూ.44,961 రికార్డ్ హైకి చేరుకున్న విషయం తెలిసిందే. ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ 3 శాతం లేదా రూ.1,300 తగ్గి కిలోకు రూ.45,697 వద్ద ఉంది. బంగారం ధర రెండు రోజుల్లో రూ.1,300 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లలోను బంగారం ధరలు భారీగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.6 శాతం తగ్గి 1,663.35కు చేరుకుంది. ఇంతకుముందు డిసెంబర్ 2012 తర్వాత తొలిసారి 1,702.56 డాలర్ల గరిష్టానికి చేరుకుంది. అక్కడి నుండి తగ్గుతూ వచ్చింది. కరోనా వైరస్‌కు తోడు ఈక్విటీ, ఆయిల్ మార్కెట్లలో సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత బంగారం వంటి పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు.

క్రూడాయిల్ దెబ్బ: రోజులో ముఖేష్ అంబానీ లక్షల కోట్ల సంపద ఆవిరి, రిలయన్స్‌ను దాటిన TCSక్రూడాయిల్ దెబ్బ: రోజులో ముఖేష్ అంబానీ లక్షల కోట్ల సంపద ఆవిరి, రిలయన్స్‌ను దాటిన TCS

Gold prices today fall for second day, silver rates slump over Rs 1,300

మార్చి 9వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.45,890, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.240 తగ్గి రూ.42,070గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 44,150, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.42,950గా ఉంది.

English summary

వరుసగా రెండో రోజు... భారీగా తగ్గిన బంగారం ధర, హైదరాబాద్‌లో ఎంతంటే? | Gold prices today fall for second day, silver rates slump over Rs 1,300

Gold prices in India today failed to hold on to early gains and moved lower on profit-taking at higher levels. On MCX, April gold futures were down 0.62% to ₹43,886 per 10 gram after having surged to ₹44,777.
Story first published: Monday, March 9, 2020, 17:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X