Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
ముంబై: బంగారం ధరలు నేడు (28 జనవరి) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గాయి. ఫ్యూచర్ మార్కెట్లో 48,700 దిగువకు వచ్చాయి. వెండి ధరలు రూ.66,000 దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ఔన్స్ 1840 డాలర్ల దిగువకు చేరుకుంది. గత ఏడాది ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7,500 వరకు తక్కువగా ఉంది. బడ్జెట్‌కు ముందు, అలాగే యూఎస్ ఫెడ్ మానిటరీ పాలసీకి ముందు పసిడి ధరలు భారీగా పడిపోతున్నాయి.
బంగారం ధరలు నిన్న కూడా తగ్గాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.313 తగ్గి రూ.48,830 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.207 క్షీణించి రూ.49,124 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి అతి స్వల్పంగా రూ.72 క్షీణించి రూ.66,463 వద్ద ముగిసింది. మే ఫ్యూచర్స్ మాత్రం రూ.135 పెరిగి రూ.67,406 వద్ద ముగిసింది.

48,800 దిగువకు పసిడి
నేడు ఉదయం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 143.00 (-0.29%) తగ్గి రూ.48,722.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,700.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,740.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,670.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7500 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 131.00 (-0.27%) తగ్గి రూ.48,985.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,980.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,987.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,931.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.66వేల దిగువకు
సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు కూడా తగ్గాయి. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 550.00 (0.83%) తగ్గి రూ.65986.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,000.00 వద్దనే గరిష్టాన్ని తాకింది. రూ.65,811.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్షీణించింది. రూ.-530.00 (-0.79%) తగ్గి రూ.66900.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,870.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,900.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,859.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1840 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 9.40 (-0.51%) డాలర్లు పెరిగి 1,835.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,831.50 - 1,843.90 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.95% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర -0.214 (-0.84%) డాలర్లు తగ్గి 25.175 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.043 - 25.375 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 42.58శాతం పెరిగింది.