నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే: ఇక్కడ జంప్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో స్వల్పంగా క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ప్రారంభ సెషన్‌లో అతి స్వల్పంగా 0.2 శాతం తగ్గినప్పటికీ, ఆ తర్వాత అతిస్వల్పగా పెరిగింది. ఉదయం గం.11.22 సమయానికి డిసెంబర్ ఫ్యూచర్స్ 0.2 శాతం (రూ.12) రూ.50,973 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,065 వద్ద ప్రారంభమైన ధర రూ.50,819 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికూ రూ.6,200 తక్కువగా ఉంది.

బంగారం, వెండి ధరలు
బంగారం డిసెంబర్ ఫ్యూచర్స్ పెరగగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.01 శాతం (రూ.6) క్షీణించి రూ.51,050 వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.120 (0.19 శాత) క్షీణించి రూ.62,161 పలికింది. రూ.62,161 వద్ద గరిష్టాన్ని, రూ.61,881 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.87 (0.14 శాతం) క్షీణించి కిలో రూ.63,820 పలికింది. రూ.63,820 వద్ద గరిష్టాన్ని, రూ.63,707 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్చి నుండి బంగారం ధరలు రూ.12వేలకు పైగా పెరిగాయి.

కామెక్స్‌లో డౌన్
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి ఫ్యూచర్ 0.10 శాతం క్షీణించి 1,910 డాలర్లు పలికింది. 1,905.05 - 1,910.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1911.90 వద్ద ముగిసింది. ఏడాదిలో పసిడి ధర 25 శాతం పెరిగింది. డిసెంబర్ ఫ్యూచర్స్ వెండి ఔన్స్ ధర 0.13 శాతం క్షీణించి 24.602 డాలర్లు పలికింది. 24.308 - 24.517 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. వెండి ఏడాదిలో 34.27 శాతం పెరిగింది. ప్లాటినమ్ ధర 0.1 శాతం ఎగిసి 878.15 డాలర్లు పలికింది. ప్రపంచఅతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫడ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 0.23 శాతం పెరిగి 1,266.72 టన్నులకు చేరుకున్నాయి.

బులియన్ మార్కెట్లో అప్
బులియన్ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.52,220 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.47,870 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.53,100, 22 క్యారెట్ల బంగారం రూ.49,600 పలికింది. ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.50,750-50,600, నిరోధకస్థాయి రూ.51,100-51,250. వెండి మద్దతు ధర రూ.61,600-61,000, నిరోధకస్థాయి రూ.63,000-63,500.


Click it and Unblock the Notifications