మళ్ళీ కాస్త తగ్గిన బంగారం ధరలు; నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలిలా!!
నిన్న ఆర్నమెంట్ బంగారానికి 400 రూపాయలు, స్వచ్ఛమైన బంగారానికి 430 రూపాయలు పెరిగిన బంగారం ధరలు, నేడు మళ్లీ కాస్త తగ్గాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి వంద రూపాయలు తగ్గి 55, 500 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి వంద రూపాయలు తగ్గి 60, 550 రూపాయల వద్ద విక్రయించబడుతుంది.
హైదరాబాదులో బంగారం ధరల విషయానికి వస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 55 వేల 600 రూపాయలు ఉండగా, నేడు వంద రూపాయలు తగ్గి 55, 500 రూపాయల వద్ద విక్రయించబడుతుంది. ఇక 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 100రూపాయలు తగ్గి, 60,550 రూపాయల వద్ద విక్రయించబడుతుంది.

దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,650 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 700 రూపాయలు గా ట్రేడవుతోంది.ముంబై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 500 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,550 రూపాయలుగా విక్రయించబడుతుంది.
చెన్నై లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 900 రూపాయలు కాగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల రూపాయలుగా విక్రయించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, రాజమండ్రి లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,500 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,550 రూపాయలుగా విక్రయించబడుతుంది.
మొత్తంగా చూస్తే నేడు దేశవ్యాప్తంగా కాస్త బంగారం ధరలు తగ్గాయి. ఈ బంగారం ధరల మధ్య హెచ్చుతగ్గుల ఊగిసలాట మరి కొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక దశలో భారీగా పెరిగిన బంగారం క్రమంగా కాస్త తగ్గింది. అయితే ప్రస్తుత పరిస్థితులలో పసిడి మరింత పతనం అయ్యే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications