మళ్ళీ బంగారం ధరల షాక్.. ఒక్కరోజులో భారీగా బంగారం ధరల పెరుగుదల; తాజాగా ధరలివే!!
నిన్నటి దాకా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. బంగారం ధరలు తగ్గుతున్నాయని సామాన్య మధ్య తరగతి ప్రజలు రిలీఫ్ తీసుకునే లోపే మళ్లీ బంగారం ధరలు పెరగడం బంగారం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తుంది. తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 400 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 440 రూపాయలు మేర ధరలు పెరిగాయి.
అంతర్జాతీయంగా నేటి బంగారం ధర స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1955.50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. భారతదేశంలో బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ప్రస్తుతం 55,850 రూపాయలు, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 60, 930 రూపాయలుగా ట్రేడవుతోంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,850 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 930 రూపాయల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలోనూ 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం 55,850 రూపాయలు కాగా, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 60, 930 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేల రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,080 రూపాయలుగా ట్రేడవుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,850 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 930 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రధాన నగరాలలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,850 రూపాయలు కాగా, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 60, 930 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
దేశంలోనే బంగారం ధరలు అధికంగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరు, మధురై తదితర ప్రధాన నగరాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,450 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 580 రూపాయలు గా ప్రస్తుతం ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications