For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ అప్, ఫిబ్రవరి డౌన్: పైపైకి వెండి

|

దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, ఢిల్లీ తదితర మార్కెట్లలో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.130కి పైగా తగ్గి రూ.51,100 పైకి చేరుకుంది. కిలో వెండి రూ.475 పెరిగి రూ.62,650ని తాకింది. అయితే ఫ్యూచర్ మార్కెట్లో అతి స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ రూ.51,000 దిగువన ఉంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,200కు పైగా తక్కువ పలుకింది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.17వేలకు పైగా తక్కువతో ట్రేడ్ అయింది.

డిసెంబర్ పెరిగి.. ఫిబ్రవరి డౌన్

డిసెంబర్ పెరిగి.. ఫిబ్రవరి డౌన్

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.11 (0.02 శాతం) పెరిగి రూ.50,941 పలికింది. రూ.51,114 వద్ద గరిష్టాన్ని, రూ.50,704 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. పది గ్రాముల పసిడి ఫ్యూచర్ రూ.107 (0.21 శాతం) తగ్గి రూ.50,956 వద్ద ట్రేడ్ అయింది. నేటి గరిష్టం రూ.51,210, కనిష్టం రూ.50,826 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ ఫ్యూచర్స్, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రెండు దాదాపు ఒకే ధర వద్ద ఉన్నాయి.

వెండి ధర అప్

వెండి ధర అప్

కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.229 (0.37 శాతం) పెరిగి రూ.62,135 పలికింది. నేడు రూ.62,580 వద్ద గరిష్టాన్ని, రూ.61,510 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్చి ఫ్యూచర్స్ రూ.66 (0.10 శాతం) పెరిగి, రూ.63,821 వద్ద ట్రేడ్ అయింది. నేడు రూ.64,137 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,250 వద్ద గరిష్టాన్ని, రూ.63,360 వద్ద కనిష్టాన్ని తాకింది.

పెరిగిన బంగారం, వెండి ధరలు

పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్ పసిడి 0.31 శాతం పెరిగి 1,911.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,898.80 - 1,913.50 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 24 శాతానికి పైగా పెరిగింది.

ఇక ఔన్స్ వెండి 0.49 శాతం పెరిగి 24.543 డాలర్లు పలికింది. 24.282 - 24.733 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఈ ఏడాది వెండి 36 శాతానికి పైగా పెరిగింది.

English summary

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ అప్, ఫిబ్రవరి డౌన్: పైపైకి వెండి | Gold prices rise marginally, Around Rs 51,000, silver rises by Rs 230

Gold prices fell marginally by Rs 195 to Rs 51,043 per 10 gram in the Mumbai retail market on a stronger rupee and lacklustre global cues. The precious metal steadied around $1,900 per troy ounce as investors weighed fading prospects of financial aid before next week’s US presidential elections.1
Story first published: Tuesday, October 27, 2020, 22:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X