మళ్ళీ పసిడి పరుగులు.. నేడు భారీగా పెరిగిన ధరలు; తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. కాస్త తగ్గినట్టే తగ్గి, మళ్లీ స్పీడ్ పెంచుతోంది. తాజాగా నేడు దేశీయంగా 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారానికి 300 రూపాయలు, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారానికి 340 రూపాయల మేర బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరల్లో స్థిరత్వం ఇప్పట్లో ఉండబోదని, హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే నేడు హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56వేల రూపాయలుగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,100 రూపాయలుగా ట్రేడవుతోంది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలోనూ 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56 వేల రూపాయలుగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,100 రూపాయలుగా ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56, 150 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,250 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేల రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 100 రూపాయలు గా విక్రయించబడుతుంది.
బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేల 50 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,150 రూపాయలుగా విక్రయించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, రాజమండ్రి, కాకినాడలలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56 వేల రూపాయలుగా, 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,100రూపాయలు గా ట్రేడ్ అవుతుంది.
దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, ఈరోడ్, తిరుచ్చి, తిరుపూర్, తిరునల్వేలి లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేల 380 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 505 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications