బంగారం ధరల ఢమాల్; నేడు భారీగా తగ్గిన బంగారంధరలు; తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
భారతదేశంలో బంగారాన్ని ప్రజలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. భారతీయులకు బంగారు ఆభరణాలపై ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఏ చిన్న సందర్భం అయినా, వివాహాది వేడుకలైనా బంగారం కొనుగోలు చేయకుండా జరగనే జరగదు. అంతలా భారతీయులతో పెనవేసుకుపోయిన బంగారం ఇటీవల ధరల దూకుడును కొనసాగిస్తోంది.
నిన్న పెరిగిన బంగారం ధరలు మళ్లీ నేడు గణనీయంగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 450 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 490 రూపాయల మేర ధరలు తగ్గాయి. దీంతో దేశీయంగా బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 55, 800 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 60,870 రూపాయలుగా ట్రేడవుతున్నాయి.

ఇదిలా ఉంటే హైదరాబాద్ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55, 800 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 870 రూపాయలుగా ట్రేడవుతోంది. హైదరాబాద్ మాత్రమే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55, 800 రూపాయలుగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60, 870 రూపాయలుగా ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,950 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 20 రూపాయలు గా ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 800 రూపాయలు గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 870 రూపాయలు గా ట్రేడవుతోంది.
బెంగళూరులో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,850 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60, 920 రూపాయలుగా ట్రేడవుతోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ లలో 10గ్రాములు 22క్యారెట్ల బంగారం ధర 55,800 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 రూపాయలుగా ట్రేడవుతోంది.

దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే చెన్నై తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, ఈ రోడ్, తిరునల్వేలి, తిరుచ్చి, తిరుపూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేల 250 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 360 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications