For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 రోజుల్లో రూ.2,000 పెరిగిన బంగారం ధర, ట్రంప్ హామీతో రివర్స్

|

బంగారం ధరలు బుధవారం పెరిగాయి. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విలువైన లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. చమురు ధరలదీ అదే దారి. రెండు దేశాల యుద్ధ వాతావరణం కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పసిడి వైపు దృష్టి సారిస్తున్నారు. ఇరాన్ కీలక కమాండర్ ఖాసీమ్ సులేమానీని అమెరికా సైన్యం డ్రోన్ దాడి చేసి హతమార్చిన నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

<strong>అమెరికాXఇరాన్: భారీగా పెరిగిన బంగారం ధర, పరిస్థితి ఇలాగే ఉంటే</strong>అమెరికాXఇరాన్: భారీగా పెరిగిన బంగారం ధర, పరిస్థితి ఇలాగే ఉంటే

రూ.2,000 పెరిగిన బంగారం

రూ.2,000 పెరిగిన బంగారం

ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ బుధవారం 1.5 శాతం లేదా రూ.630 పెరిగింది. తద్వారా 10 గ్రాముల బంగారం రూ.41,290కి చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ 1.4 శాతం లేదా రూ.700 పెరిగి రూ.48,785కు చేరుకుంది. బంగారం ధరలు నాలుగు రోజుల్లో 10 గ్రాములకు రూ.2,000 పెరిగింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడమూ

డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడమూ

భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి అంశాలు బంగారం ధరలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా, ఆందోళనకంగా మారాయని, దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అధికంగా పెరుగుతోందని చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 2 శాతం పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1,600 డాలర్ల మార్క్‌ను దాటింది. తద్వారా ఏడేళ్ల గరిష్టానికి చేరుకుంది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత బంగారం వైపు ఇన్వెస్టర్లు మరలుతుండటంతో దీనికి డిమాండ్ పెరిగింది. స్పాట్ గోల్డ్ 2 శాతం పెరిగి ఔన్స్ 1,610.90కి చేరుకుంది. వెండి 1.2 శాతం పెరిగి 18.60 డాలర్లకు చేరుకుంది. ప్లాటినమ్ 0.3 శాతం పెరిగి 973.95 డాలర్లకు, పల్లాడియం 2,056.01తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది.

ట్రంప్ మాటతో...

ట్రంప్ మాటతో...

సులేమనీ మృతికి ఇరాన్ ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక క్యాంపుపై దాడి చేసింది. ఈ ఘటనలో 80 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, యూఎస్ ఎంబసీ లక్ష్యంగా కూడా దాడులు నిర్వహించింది. ఇరాక్ వదిలి అమెరికా వెళ్లిపోవాలని హెచ్చరించింది. అయితే ట్రంప్ మాత్రం శాంతి మంత్రం పటించారు. అమెరికా ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదన్నారు. ఇరాన్‌కు గొప్ప భవిష్యత్ ఉండాలనుకుంటే శాంతి మార్గంలో నడవాలని హితవు పలికారు. లేదంటే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్ ఇంకా దాడులకు పాల్పడితే అమెరికా బలగాలు అందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇరాన్ వెనక్కి తగ్గినట్లు అనిపిస్తుందని, ఇది మంచిదేనని అన్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఆయన మాట్లాడారు. దీంతో ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో బంగారంపై కాస్త నిలకడగా ఉంది. స్పాట్ గోల్డ్ XAUలో ఔన్స్‌ ఎలాంటి మార్పు లేకుండా 1,555.51గా ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ GCv1 0.3 శాతం తగ్గి 1,555.90గా ఉంది.

English summary

4 రోజుల్లో రూ.2,000 పెరిగిన బంగారం ధర, ట్రంప్ హామీతో రివర్స్ | Gold prices in India surged to record highs today as the Iran-US conflict escalated

Gold prices in India surged to record highs today as the Iran-US conflict escalated after the Persian Gulf nation fired missiles at multiple bases housing US troops in Iraq.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X