నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. గత కొంతకాలం నుంచి బంగారం ధరల మధ్య ఊగిసలాట ఇలాగే కొనసాగుతుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలలో గణనీయమైన మార్పు వచ్చింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల దూకుడు కొనసాగుతుంది.
తాజాగా నేడు బంగారం ధరల విషయానికి వస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు పెరిగి 55,600 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయలు పెరిగి 60,650 వద్ద విక్రయించబడుతుంది. నిన్న 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,200 రూపాయలుగానూ, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,220 రూపాయలుగానూ విక్రయించబడింది.

నేడు హైదరాబాద్లో బంగారం ధరలు విషయానికి వస్తే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 60, 650 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, ఆర్నమెంట్ బంగారం ధర 55, 600 రూపాయలుగా విక్రయించబడుతుంది. దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 750 రూపాయలు గా ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 830 రూపాయలుగా విక్రయించబడుతుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,600 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,650 గా ట్రేడవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, అనంతపురం, ప్రకాశం, కాకినాడ, రాజమండ్రిలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,600 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,650 రూపాయలుగా ట్రేడవుతోంది.
తగ్గినట్టే తగ్గి మళ్లీ బంగారం ధరలు పెరుగుతుండడంతో పసిడి ప్రియులు ఇలా అయితే బంగారాన్ని కొనుగోలు చేయడం కష్టమే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా బంగారం ధరలు తగ్గితే బాగుండు అని ఆశగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications