బంగారం ధరలు తగ్గాయోచ్.. నేడు హైదరాబాద్ లో బంగారం ధరలు ఎంతంటే!!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పరిస్థితుల మధ్య బంగారం, వెండి ధరలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ దశలో 62వేల ఆల్ టైం హైకి చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా బంగారం ధర విషయానికి వస్తే దేశీయంగా బంగారం ధరలు నేడు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది.
10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం మీద నాలుగు వందల రూపాయలు, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మీద నాలుగు వందల ముప్పై రూపాయలు బంగారం ధరలు తగ్గాయి. ఇదిలా ఉంటే హైదరాబాదులో బంగారం ధరలు విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 55 వేల 200 రూపాయల ప్రస్తుతం ట్రేడవుతోంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,220 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది. హైదరాబాద్ తో పాటుగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ లో కూడా 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 55, 200 రూపాయలుగా, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 60, 220 రూపాయలుగా ట్రేడవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, రాజమండ్రి, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 200 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,220 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 55, 350 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 370 రూపాయలుగా ట్రేడవుతోంది.బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చని, ముందు ముందు బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications