ఆటాడుకుంటున్న బంగారం ధరలు; నేడు మళ్ళీ పెరుగుదల; హైదరాబాద్ లో బంగారం ధరలిలా!!
ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఈరోజు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో బంగారం కొనుగోలుదారులు మళ్లీ నిరాశకు గురయ్యారు. మొన్నటిదాకా బంగారం ధరలు తగ్గడంతో కాస్త బంగారం ధరలు ఇంకొంచెం తగ్గుతాయని ఆశపడిన బంగారం ప్రియులకు షాక్ ఇస్తూ మళ్లీ ఈ రోజు ధరలు పెరిగాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా నేడు దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 56,250 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయలు పెరిగి 61, 360 రూపాయల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాదులో బంగారం ధర విషయానికి వస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,250 రూపాయలుగా విక్రయించబడుతుంది.

హైదరాబాద్ లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,360 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర నేడు 56,400రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,510 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56, 250 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,360 రూపాయలుగా ట్రేడవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,250 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 360 రూపాయలు గా ప్రస్తుతం విక్రయించబడుతుంది.
దేశంలోనే బంగారం ధరలు అధికంగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, ఈ రోడ్, తిరుపూర్, తిరునల్వేలి, తిరుచ్చి ఈ నెల 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56, 650 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 61, 800 రూపాయలుగా విక్రయించబడుతుంది.


Click it and Unblock the Notifications