రెండు నెలల కనిష్టానికి క్షీణించిన బంగారం ధరలు.. నేడు తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలిలా!!
రెండు నెలల క్రితం బంగారం ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఓ దశలో బంగారం ధరలు 62,000 రూపాయలకు చేరుకోగా ప్రస్తుతం 61,000 రూపాయలకు దిగువన బంగారం ధరలు ట్రేడవుతున్నాయి. రెండు నెలల కనిష్టానికి తాజాగా పసిడి రేటు దిగొచ్చింది. ఇది బంగారం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తాజాగా ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 1941 డాలర్ల వద్ద కొనసాగుతుంది. దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే నేడు ఆర్నమెంట్ బంగారం మీద వంద రూపాయలు, స్వచ్ఛమైన బంగారం మీద నూట పది రూపాయల మేర బంగారం ధరలు తగ్గాయి.

నేడు హైదరాబాదులో బంగారం ధరల విషయానికి వస్తే 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,450 రూపాయలుగా ట్రేడవుతోంది.10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,490గా ప్రస్తుతం విక్రయించబడుతుంది. హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,450 రూపాయలుగా ట్రేడవుతోంది. 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,490 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 600 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 630 రూపాయల వద్ద ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 450 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 490 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,500 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,530 రూపాయల వద్ద విక్రయించబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, ఏలూరులో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,450 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,490గా ప్రస్తుతం ట్రేడవుతోంది.
మొత్తంగా చూస్తే గత రెండు నెలలుగా విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కొద్దికొద్దిగా క్షీణిస్తూ ఉండటం ప్రధానంగా కనిపిస్తుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సువర్ణావకాశం అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications