విపరీతంగా పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పడుతున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధరలలో తగ్గుదల నమోదు అవుతుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పటికే కొండకి కూర్చున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంతగా బంగారం ధరలు ఆందోళనకరంగా పెరిగాయి. 60 వేలకు పైగా స్వచ్ఛమైన బంగారం ధరలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే నేడు దేశీయంగా బంగారం ధరలలో తగ్గుదల నమోదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మీద 390 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మీద 430 రూపాయల మేర బంగారం ధర తగ్గింది. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో ప్రస్తుతం 55,400గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,430 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,550 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,580 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,430 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది .ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, కర్నూలు, చిత్తూరు, కాకినాడ, రాజమండ్రి వంటి నగరాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,430 రూపాయలుగా కొనసాగుతుంది.

ఇది ఇలా ఉంటే దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేలకు పైగా నేడు విక్రయించబడుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుపూరు, తిరుచ్చి, తిరునవ్వేలి, ఈ రోడ్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 100 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తంగా బంగారం ధరలు గత ఐదు రోజుల నుంచి తగ్గుతున్నప్పటికీ, ధర మాత్రం 60 వేలను దాటే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే కొనుగోలు చేయలేనంతగా పెరిగిపోయిన బంగారం ధరలు ఇంకా తగ్గాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications