భలే ఛాన్సులే.. వరుసగా మూడోరోజు పడిపోయిన బంగారం ధరలు; నేడు హైదరాబాద్లో ధరలిలా!!
గత మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు మళ్లీ బంగారం ధరలు తగ్గుతాయి అన్న ఆశ కలుగుతుంది. నేడు దేశీయంగా బంగారం ధర 22 క్యారెట్ల బంగారం రేటు 300 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 330 రూపాయల మేర తగ్గింది.
గత మూడు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు తగ్గడంతో ప్రస్తుతం దేశంలో స్వచ్ఛమైన బంగారం ధర 61 వేల దిగువకు చేరుకుంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు విషయానికొస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 870 రూపాయలుగా ట్రేడవుతోంది.

నిన్న హైదరాబాదులో ఈ ధరలు ఆర్నమెంట్ బంగారానికి 56,100 రూపాయలు స్వచ్ఛమైన బంగారానికి 61, 200 రూపాయలుగా ఉంది.హైదరాబాద్ మాత్రమే కాకుండా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800 రూపాయలు గానూ, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 రూపాయలు గానూ ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,950 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,020 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 800 రూపాయలు కాగా, గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 ,870 రూపాయలుగా ట్రేడవుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, రాజమండ్రి, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 870 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.
ప్రస్తుతం తగ్గుతున్న బంగారం ధరల క్షీణత ఇదేవిధంగా కొంత కాలం కొనసాగితే బాగుంటుందని బంగారం కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా బంగారం ధరలు తగ్గుతాయా? లేక పెరుగుతాయా అన్నది అంతర్జాతీయ పరిణామాలు నిర్ణయిస్తాయి.


Click it and Unblock the Notifications