For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, రూ.2,200 పడిపోయిన వెండి ధర

|

బంగారం, వెండి ధరలు బుధవారం (అక్టోబర్ 28) భారీగా క్షీణించాయి. ఫ్యూచర్ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ.400కు పైగా, కిలో వెండి రూ.2000కు పైగా క్షీణించింది. సాయంత్రం గం.9.30 సమయానికి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.425 (0.83 శాతం) క్షీణించి రూ.50536.00 పలికింది. రూ.51,065 వద్ద ప్రారంభమైనప్పటికీ నేటి గరిష్టం అదే. కనిష్టం ఓ సమయంలో రూ.50,230కి చేరుకుంది. అంటే ఓ సమయంలో రూ.700కు పైగా క్షీణించింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,700 వరకు తక్కువ పలికింది.

ఈసారి భారత జీడీపీ సున్నా, ప్రపంచ వేగవంత ఆర్థిక వ్యవస్థగా..: మోడీతో నిర్మల భేటీఈసారి భారత జీడీపీ సున్నా, ప్రపంచ వేగవంత ఆర్థిక వ్యవస్థగా..: మోడీతో నిర్మల భేటీ

రూ.500 వరకు తగ్గిన పసిడి

రూ.500 వరకు తగ్గిన పసిడి

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ కూడా రూ.491 (0.95 శాతం) క్షీణించి 10 గ్రాములు రూ.50,565 పలికింది. రూ.51,050 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,097 వద్ద గరిష్టాన్ని, రూ.50,342 వద్ద కనిష్టాన్ని తాకింది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ డాలర్ వ్యాల్యూ, అమెరికా ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలు పసిడిపై ఒత్తిడిని తగ్గించాయి.

రూ.2వేలకు పైగా తగ్గిన పసిడి

రూ.2వేలకు పైగా తగ్గిన పసిడి

కిలో వెండి ధర ఏకంగా రూ.2,229 (3.58 శాతం) తగ్గింది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.60,052కు దిగి వచ్చింది. రూ.62,060.00 ప్రారంభమైన ధర, రూ.62,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,100.00 కనిష్టాన్ని తాకింది. మార్చి ఫ్యూచర్స్ కూడా భారీగా తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,137.00 (-3.34%) క్షీణించి రూ.61,770 పలికింది. రూ.63,729.00 ప్రారంభమైన ధర, రూ.64,223.00 వద్ద గరిష్టాన్ని, రూ.60,956.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో పోలిస్తే దాదాపు రూ.19వేల వరకు తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోను అలాగే

అంతర్జాతీయ మార్కెట్లోను అలాగే

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1900 దిగువకు వచ్చింది. ఔన్స్ బంగారం 1.52 శాతం క్షీణించి 1,882.90 డాలర్లు పలికింది. 1,869.65 - 1,912.50 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఈ ఏఢాది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు 25 శాతం పెరిగాయి. వెండి అయితే ఏకంగా 4.20 శాతం క్షీణించి 23.538 డాలర్లు పలికింది. 23.062 - 24.672 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 34 శాతం పెరిగింది.

English summary

భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, రూ.2,200 పడిపోయిన వెండి ధర | Gold prices down to Rs 50,536, Silver down Rs above 2,000

Gold prices fell to Rs 50,536 per 10 gram in the multi commodity exchange on a firm dollar and weak global cues.
Story first published: Wednesday, October 28, 2020, 21:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X