For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: తగ్గినట్లే తగ్గి, భారీగా పెరిగిన బంగారం ధరలు

|

బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుండి రూ.1500 వరకు తగ్గిన పసిడి ధరలు, అంతలోనే నిన్న మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మొన్న రూ.60,000 దిగువకు వచ్చినప్పటికీ, నిన్న రూ.1400 వరకు పెరిగాయి. దీంతో మళ్లీ ఈ మార్కును దాటడంతో పాటు రూ.61,000ను సమీపించింది. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.265 పెరిగి రూ.50,460 వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1368 పెరిగి రూ.60,869 వద్ద ముగిసింది. నేడు (జూన్ 16, 2022) ప్రారంభ సెషన్‌లోను ధరలు పెరిగాయి.

ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం సెషన్‌లో రూ.230 పెరిగి రూ.50,668 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,682 వద్ద ట్రేడ్ అయ్యాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.61,000 క్రాస్ చేసింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.376 తగ్గి రూ.61,073, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.349 పెరిగి రూ.61,794 వద్ద ట్రేడ్ అయింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5500 వరకు తక్కువగా ఉంది.

Gold price today: Yellow metal rises over RS 50,600

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం సెషన్‌లో 1820 డాలర్ల దిగువన ముగిసినప్పటికీ, నేడు 1830 డాలర్లు దాటింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 13 డాలర్లు ఎగిసి 1833 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.250 డాలర్లు లాభపడి 21.670 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

Gold price today: తగ్గినట్లే తగ్గి, భారీగా పెరిగిన బంగారం ధరలు | Gold price today: Yellow metal rises over RS 50,600

Gold prices rallied as the dollar and Treasury yields retreated after the Federal Reserve announced the biggest US interest rate hike since 1994 and flagged economic risks. Spot gold rose 1.4% to $1,833.42 per ounce.
Story first published: Thursday, June 16, 2022, 10:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X