బంగారాన్ని ఇష్టంగా కొనుగోలు చేసే దేశాలలో భారతదేశం ఒకటి. అటువంటి భారతదేశంలో ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్న తీరు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితిని సామాన్యులకు కల్పిస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ధరలు ఎంతగా పెరుగుతున్నాయో అంతస్థాయిలో తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉదాహరణకు ఒక్కరోజు ధర 200 రూపాయల మేర పెరిగితే, ధర తగ్గడం మాత్రం కేవలం 100 రూపాయల మేర తగ్గుతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ లో 62వేలకు పైనే పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా..
ఇక తాజాగా బంగారం ధరల విషయానికి వస్తే నేడు కొద్దిగా క్షీణించినట్లుగా కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేయలేదు. ఈరోజు ఈ సమయానికి హైదరాబాద్ లో 22 క్యారెట్ల, 10 గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 56 వేల 950 రూపాయలుగా ఉంది. గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,200 వద్ద స్థిరంగా ఉంది అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,950 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

ఢిల్లీ లో బంగారం ధరలు పది రోజుల్లో ఎంతగా పెరిగాయంటే
ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరలు విషయానికి వస్తే ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 52,350 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,100 వద్ద ట్రేడ్ అవుతుంది. గత పది రోజుల్లో ఢిల్లీలో బంగారం ధర బాగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. జనవరి 9వ తేదీన ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,750 ఉంటే, నేడు 52,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే బంగారం ధర ఢిల్లీలో ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే, జనవరి 9న 56,440 ట్రేడ్ కాగా ఈరోజు 57,100 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ బంగారం ధరల పెరుగుదల మరింత నమోదు చేసే పరిస్థితి కనిపిస్తుంది.

ముంబైలో గత 10 రోజుల్లో బంగారం ధరల పెరుగుదల ఇలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబైలో 52,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు 56,950 వద్ద కొనసాగుతుంది. గత పది రోజుల్లో ధరలు ఏ విధంగా పెరిగాయి అంటే.. జనవరి 9న ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 600 రూపాయలుగా ఉంది. నేడు 52,200గా ట్రేడ్ అవుతుంది. ఇక జనవరి 9న ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,290 రూపాయలుగా ట్రేడ్ అయ్యింది. ఇక నేడు 56,950గా ట్రేడ్ అవుతుంది.

బంగారం ధరల పెరుగుదలకు కారణాలివే
మొత్తంగా చూస్తే పెరిగిన బంగారం ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భావన వ్యక్తం అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని భావిస్తున్నారు. అయితే నేడు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు రేపు ఏ విధంగా మారుతాయి అన్నది కొనుగోలుదారులు ఆసక్తిగా చూస్తున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..



Click it and Unblock the Notifications