బంగారం కొనుగోలులో, బంగారు ఆభరణాల వినియోగంలో భారతదేశం ముందు వరుసలో ఉంటుంది. అటువంటి భారతదేశంలో బంగారం పసిడి ప్రియులకు షాక్ ఇస్తుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొండెక్కిన గోల్డ్ రేట్లు బంగారం కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొత్త సంవత్సరం పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి సరికొత్త గరిష్ట ధరలకు చేరుతున్న పసిడి ఆందోళన కలిగిస్తుంది. ఊహించని విధంగా రెండేళ్ల గరిష్టానికి భారతదేశంలో బంగారం ధరలు చేరడం కొనుగోలుదారులపై పిడుగుపాటు గా మారింది.

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలిలా
ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ లో బంగారం రేటు విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 50వేల 450 రూపాయలు కాగా నేడు 50,950 రూపాయలుగా ఉంది. నిన్నటికి ఈ రోజుకీ 500రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు నిన్న 55,045 కాగా ఈరోజు 55,580గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇప్పటివరకు బంగారం ధర 535 రూపాయలు పెరిగినట్టుగా కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాదుతో పోలిస్తే కాస్త బంగారం ధర ఎక్కువగానే ఉంటుంది.

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా
ఈరోజు ఢిల్లీలో బంగారం ధర విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 50,600 కాగా ఈరోజు ఇప్పటివరకు 51 వేల100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర నిన్న 55,200 రూపాయలు కాగా ఈరోజు ఇప్పటివరకు 55,730 రూపాయలుగా ఉంది. నిన్నటి తో పోలిస్తే ఈ రోజు ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ముంబైలో నేడు బంగారం ధరలు ఇలా
ఇక దేశ ఆర్థిక రాజధానిలో ను బంగారం ధరలు ఈరోజు నిన్నటితో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50 వేల 950 రూపాయలు గా ఉంది. నిన్న 50,450 రూపాయల వద్ద ఉన్న బంగారం నేడు 10 గ్రాములకు 500 రూపాయలు పెరిగింది. ముంబై 24 క్యారెట్ల బంగారం నేడు ఇప్పటివరకూ 55,580 రూపాయలుగా ఉంది. నిన్న ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 55,045 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధరలో నేడు 535 రూపాయల పెరుగుదల కనిపించింది. మొత్తంగా చూస్తే పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు షాక్ అనే చెప్పాలి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications