For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేడు పెరిగిన ధర, ఐనా బంగారం మరింత దిగివచ్చే అవకాశముందా?

|

బంగారం ధర నేలచూపులు చూస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు పసిడి వంటి సురక్షిత అతి ఖరీదైన లోహాలపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడంతో ధరలు పెరిగాయి. అయితే మార్కెట్ పరిస్థితి బాగా లేదని, బంగారంపై పెట్టుబడి కూడా అంత లాభదాయకం కాదని ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నారు. దీంతో గత నాలుగైదు రోజులుగా పసిడి ధరలు తగ్గుతున్నాయి.

రూ.4,000 డౌన్! భారీగా తగ్గిన బంగారం ధర, 1983 తర్వాత ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారిరూ.4,000 డౌన్! భారీగా తగ్గిన బంగారం ధర, 1983 తర్వాత ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి

ఏప్రిల్ కాంట్రాక్ట్ రూ.38,527

ఏప్రిల్ కాంట్రాక్ట్ రూ.38,527

పసిడి ఏప్రిల్ కాంట్రాక్ట్ ఈ వారం మరింత తగ్గి రూ.38,572కు దిగి రావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంట్రాక్టుకు ఈ స్థాయి మద్దతుగా కనిపిస్తోంది. దీనిని నిలబెట్టుకొని పక్షంలో రూ.37,743 వరకు దిద్దుబాటు అవుతుందని చెబుతున్నారు.

ఫెడ్ రేట్లు తగ్గిస్తే రాణించే అవకాశం

ఫెడ్ రేట్లు తగ్గిస్తే రాణించే అవకాశం

అమెరికా ఫెడ్ కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తే కాంట్రాక్టు రాణించే అవకాశముందని చెబుతున్నారు. అన్నట్లుగానే ఫెడ్ వడ్డీ రేట్లను దాదాపు జీరోకు తగ్గించింది. కరోనా వైరస్ కారణంగా వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఈ ప్రభావం బంగారంపై ఉంటుంది. బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగానే అమెరికా ఫెడ్ రేట్ల అనంతరం సోమవారం పసిడి 1 శాతం పెరిగింది.

1 శాతం పెరుగుదల

1 శాతం పెరుగుదల

ఎంసీఎక్స్‌లో రూ.38,500 నుండి రూ.42,400 మధ్య ట్రేడ్ అవుతుందని అంచనా. ఈ రోజు ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.656 (1.6 శాతం) పెరిగి రూ.41,004కు చేరుకుంది.

వెండిదీ అదే దారి

వెండిదీ అదే దారి

వెండి ధర కూడా ఫ్యూచర్ కాంట్రాక్ట్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కిలో వెండి రూ.39.880 కంటే కిందకు దిగి వస్తే రూ.38,850 వరకు పడిపోవచ్చు. అదే సమయంలో అమెరికా ఫెడ్ నిర్ణయం కూడా దిశానిర్దేశనం చేస్తుంది.

1400 డాలర్లకు బంగారం

1400 డాలర్లకు బంగారం

గత వారంలో తొలుత ఏడేళ్ల గరిష్టాన్ని (1,703.90 డాలర్లు) చేరిన పసిడి ధర శుక్రవారం ఇంట్రాడేలో 1,504.35 డాలర్లకు పడిపోయింది. ఈ వారంలో మొదట్లోనే గోల్డ్ ఫ్యూచర్స్ 1,400 డాలర్లకు చేరవచ్చుననది విశ్లేషకులు అంచనా. చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, స్వీడన్, నార్వే వంటి దేశాలు ఫైనాన్సియల్ మార్కెట్లను బలపరిచేందుకు ఉద్దీపనలు ప్రకటించాయి. దీంతో వచ్చే వారం బంగారం ధర 1,400 డాలర్లకు చేరే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

English summary

నేడు పెరిగిన ధర, ఐనా బంగారం మరింత దిగివచ్చే అవకాశముందా? | Gold price today: recovers 1 percent post steep fall on US Fed action

India Gold April futures rebounded on 16 March after a sharp fall seen in the previous trading session as US dollar and global equities fell sharply after the US Federal Reserve made another surprise interest rate cut.
Story first published: Monday, March 16, 2020, 12:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X