Gold price today: భారీగా క్షీణించిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా!!
గత రికార్డులను బ్రేక్ చేస్తూ విపరీతంగా పెరిగిన బంగారం ధరలు కాస్త శాంతించాయి. గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కొద్దిగా క్షీణించాయి. ఆల్ టైం హై కి చేరుకున్న బంగారం ధరలు ఎట్టకేలకు కాస్త తగ్గి బంగారం ప్రియులకు ఊరటనిచ్చాయి.

నేడు క్షీణించిన బంగారం ధరలు
నేడు భారీగా బంగారం ధర క్షీణించడంతో బంగారం కొనుగోలుదారులు కాసింత ఉపశమనం పొందారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలకు ఇటీవల కాలంలో రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయ మార్కెట్లో నేడు బంగారం ధరల విషయానికి వస్తే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1928.65 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర 23.62 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే తాజాగా కాస్త అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం వెండి ధరలు దిగొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా
ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,500గా ఉంది. నిన్న 53,100 గా ఉన్న బంగారం ధర నేడు 600 రూపాయల మేర క్షీణించి 52,500 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో నేడు ఈ సమయానికి 57,270 ట్రేడ్ అవుతోంది. నిన్న హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,930 రూపాయలు ఉంది. ఈరోజు 660 రూపాయలు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో తగ్గడం ఇదే మొదటిసారి.

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా
ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్ కంటే ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,650 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,420గా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 52,500గా ప్రస్తుతం కొనసాగుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,270 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

చెన్నైలో బంగారం ధరలిలా.. ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే భారీ తగ్గుదల
ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,450గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 58,310 అవుతుంది. దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు చెన్నై నగరంలోనే నమోదవుతాయి. ఇటు చెన్నై మాత్రమే కాకుండా కోయంబత్తూరు మధురైలో కూడా అత్యధిక ధరలు కొనసాగుతాయి. మొత్తంగా చూస్తే గత నాలుగు రోజులుగా విపరీతంగా పెరిగిన బంగారం ధరలు నేడు 600 రూపాయలు మేర తగ్గడం నిజంగా బంగారం కొనుగోలుదారులకు భారీ ఉపశమనమనే చెప్పాలి. మరి ధరలు తగ్గుదల ఇదే విధంగా కొనసాగుతుందా? లేక మళ్ళీ బంగారం ధరలు పెరుగుతాయా అన్నది మాత్రం అందరూ ఉత్కంఠ గా చూస్తున్న అంశం.


Click it and Unblock the Notifications