For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. వరుసగా రెండోరోజు క్షీణించిన బంగారం ధరలు!!

|

ఈ నూతన సంవత్సరం ప్రారంభం నుండి విపరీతంగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు గత రెండు రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా నేడు బంగారం ధరలు క్షీణించాయి. అంతర్జాతీయంగాను, దేశీయంగాను బంగారం ధరలు తగ్గడం బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిస్తున్న విషయం. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1900 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 23.38 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పడిపోవడంతో దేశీయంగాను బంగారం ధరలపై ప్రభావం కనిపిస్తుంది.

 హైదరాబాద్ మార్కెట్ లో నేడు బంగారం ధరలు ఇలా

హైదరాబాద్ మార్కెట్ లో నేడు బంగారం ధరలు ఇలా

ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,370 ట్రేడ్ అవుతుంది. నిన్న ఉన్న బంగారం ధర నేడు కూడా ఇప్పటివరకు స్థిరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత పది రోజుల నుంచి చూసుకుంటే బాగా పెరిగిన బంగారం ధరలు, ప్రస్తుతం రెండు రోజులుగా క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల నుండి ఇప్పటివరకు దాదాపు మూడు వేల రూపాయలకు పైగా బంగారం ధర పెరిగింది. ఇక గత పది రోజుల్లో అయితే 1000 రూపాయలకు పైగానే బంగారం ధర పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది

 ఢిల్లీలోనూ క్షీణిస్తున్న బంగారం ధరలు.. నేడు ధరలు ఇలా

ఢిల్లీలోనూ క్షీణిస్తున్న బంగారం ధరలు.. నేడు ధరలు ఇలా

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ తో పోలిస్తే బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,150 గా ఉంది. నిన్న కూడా 52,150 రూపాయలుగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నమోదయింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 56,890 రూపాయల గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్లకి 200 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం మీద 210 రూపాయలు తగ్గి, ఢిల్లీలోనూ గత రెండు రోజులుగా బంగారం ధరలు క్షీణిస్తున్నాయి.

 ముంబైలోనూ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..

ముంబైలోనూ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 52000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ముంబై మార్కెట్లో 56,730 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ నిన్నటితో పోలిస్తే కాస్త రేటు తగ్గిన పరిస్థితి ఉంది. తాజాగా హైదరాబాద్లో కేజీ సిల్వర్ రేట్ 500 రూపాయలు మేర తగ్గి, 74,800 వద్ద ట్రేడ్ అవుతుంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న బంగారం ధరల పతనం ఇంకా కొనసాగుతుందా? లేక మళ్ళీ ధరలు పుంజుకునే అవకాశం ఉంటుందా? అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్న అంశం.

English summary

Gold price today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. వరుసగా రెండోరోజు క్షీణించిన బంగారం ధరలు!! | Gold price today: Good news for gold buyers.. Gold prices fell for the second day in a row!!

Good news for gold buyers.. Gold prices declined for the second day in a row. Find out what is the gold price today in Hyderabad, Delhi and Mumbai.
Story first published: Thursday, January 19, 2023, 9:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X