బంగారం ధర పరుగులు పెడుతుంది. 2023 సంవత్సరంలో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. ఈ సంవత్సరం ఊహించని విధంగా బంగారం ధర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్లకు 10 నుంచి 20 శాతం బంగారం ధర పెరిగితేనే బంగారాన్ని కొనుగోలు చేయలేమని లబోదిబోమనే వాళ్ళు ఉన్నారు . అలాంటిది 2023 సంవత్సరంలోఅమాంతం 50 నుంచి 120 శాతం పెరిగే అవకాశం ఉందన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. త్వరలో బంగారం 60 వేల రూపాయలకు చేరుకుంటుందని టాక్ నడుస్తుంది.

పెరుగుతున్న బంగారం ధరలతో బెంబేలు .. దేశంలో బంగారం ధరలిలా
ఇదిలా ఉంటే తాజాగా నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. భారత దేశ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ 51,600 రూపాయలుగా ఉంది. నిన్న 51 వేల 300 రూపాయలు ఉన్న బంగారం ధర నేడు మూడు వందల రూపాయల మేర పెరిగి ప్రస్తుతం 51 వేల 600 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ఇప్పటివరకు 56,290 రూపాయలుగా ట్రేడవుతోంది. నిన్న 55,960 రూపాయలుగా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 330 రూపాయల మేర పెరిగింది.

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పటివరకు 51,600 రూపాయలుగా ట్రేడవుతోంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 300 రూపాయలు ఉంది. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు ఇప్పటివరకు 56,290 రూపాయలుగా ట్రేడవుతోంది. నిన్న 55,960 రూపాయలుగా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 330 రూపాయల మేర పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తుంది.

ఢిల్లీలోనూ బంగారం ధర పెరుగుదల
దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ పోల్చుకుంటే ధర ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,750 గా ఉంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 51,450 రూపాయలు గా నమోదయింది. నిన్నటికి ఈరోజుకి మూడు వందల రూపాయల మేర 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు ఇప్పటివరకు 56,440 రూపాయల వద్ద ట్రేడవుతోంది. నిన్న ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56 వేల 110 రూపాయలుగా ఉంది. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ 24 క్యారెట్ల బంగారం పై 330 రూపాయల మేర పెరుగుదల నమోదైంది.

ముంబైలో పెరిగిన బంగారం ధరలు .. తాజా ధరలిలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధర విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర, 10 గ్రాములకు 51,600 గా ఉంది. నిన్నటి ధర 51 వేల 300 రూపాయలు కాగా, మూడు వందల రూపాయల మేర బంగారం ధర పెరిగింది. ముంబై లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఇప్పటి వరకు 56 వేల 290 రూపాయలుగా ట్రేడవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 55,962 గా ఉంది. మొత్తంగా చూస్తే బంగారం ధర పెరుగుతున్న పరిస్థితులు, బంగారం ధర కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ సామాన్యులను బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితికి తీసుకు వెళుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications