ఒకపక్క పండుగలు, శుభకార్యాలకు జనం సిద్ధమవుతున్న సమయంలో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. కొనుగోలుదారులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధరలు పైకి పెరుగుతున్న తీరు, భవిష్యత్తులో సామాన్య మధ్య తరగతి వర్గాలు బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారా అన్న ప్రశ్నకు కారణంగా మారుతున్నాయి. బంగారం, వెండి రేట్లు ఊహించని విధంగా రోజురోజుకీ రికార్డు స్థాయికి పెరుగుతున్న పరిస్థితి దేశీయంగానే కాదు అంతర్జాతీయం గానూ కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి .అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే ఈ పెరుగుదల కనిపిస్తుంది.

హైదరాబాద్ లో బంగారం ఈరోజు ధరలు ఇలా
ఇక ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1858 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ ధర కూడా ఔన్స్ కు 23.89 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.62 రూపాయలుగా ఉంది. ఇదిలా ఉంటే ఇక దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ఇప్పటివరకు 10 గ్రాములకు 51 వేల 100 రూపాయలుగా ఉంది. నిన్న 50,950 రూపాయలుగా ఉన్న బంగారం ధర నేడు 150 రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ బంగారం ధర తులానికి ఈరోజు ఇప్పటివరకు 55, 750 రూపాయలు గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం నిన్న 55,580 గా ఉంది. నిన్నటికి ఈరోజుకి 170 రూపాయలు 24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీ లో పెరిగిన బంగారం ధరలు ఇలా
దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో నేడు ఇప్పటివరకు 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల కు 51,250 రూపాయలుగా ఉంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 100 రూపాయలుగా నమోదైంది. నిన్నటికి నేటికి 150 రూపాయల మేర 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో నేడు 55,900 రూపాయలు గా నమోదయింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 55, 730 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా 170 రూపాయలు పెరిగినట్టు కనిపిస్తుంది.

ముంబై లోనూ బంగారం ధరల దూకుడు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు బంగారం ధరలు విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ఇప్పటివరకు 51 వేల 100 రూపాయలు గా ఉంది. ఢిల్లీలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ధర కొనసాగుతోంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబైలో 50, 950 రూపాయలుగా ఉంది. ఇదిలా ఉంటే ముంబై లో 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ఇప్పటివరకు 55,750 రూపాయలుగా ఉంది. నిన్నటి ధర విషయానికి వస్తే 55,580 రూపాయలుగా ముంబై లో బంగారం ధర నమోదయింది. గత పది రోజుల్లో చూసుకుంటే కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే బంగారం ధరలు తగినట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే గత పది రోజులుగా బంగారం ధరలు దూకుడుగా ట్రేడ్ అవుతున్న పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పెరుగుతున్న వెండి ధరలు.. హైదరాబాద్, ఢిల్లీలో వెండి ధరలు ఇలా
ఇదిలా ఉంటే వెండి ధరలు కూడా ఇటీవల భారీగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. వరుసగా రెండు రోజుల్లో వెండి 1200 రూపాయల మేర పెరిగింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 75 వేల500 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 72 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ తో పోలిస్తే హైదరాబాద్ లో వెండి ధర ఎక్కువగా ఉంది. ఇక ఈ స్థాయిలో వెండి ధరలు పెరగడం కూడా ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పొచ్చు.
More From GoodReturns

Hyderabad: మధ్యప్రదేశ్ కొండల్లో కొత్త హైవే.. హైదరాబాద్ ప్రయాణికులకు ఇక విమాన వేగంతో ప్రయాణం!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Gold silver: బంగారం, వెండి ధరల్లో మళ్ళీ కదలిక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే..

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..



Click it and Unblock the Notifications