బంగారం ధరలు శుక్రవారం (జూన్ 19) స్వల్పంగా తగ్గాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ప్రకారం 10 గ్రాముల బంగారం ధర రూ.47,571 నుండి రూ.47,496కు తగ్గింది. అదే సమయంలో వెండి ధర పెరిగింది. కిలో వెండి రూ.48,352 నుండి రూ.48,360కు చేరుకుంది. ఎక్సైజ్ డ్యూటీ, వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్, మేకింగ్ ఛార్జీలను బట్టి ఆయా ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
చైనా పెట్టుబడులు: మన స్టార్టప్స్‌కు దెబ్బ.. అలా చేస్తే ఇబ్బందికరమే!'

వివిధ నగరాల్లో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరిగి రూ.రూ.47,450 పలికింది. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే రూ.50 తగ్గి రూ.46,250గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,510గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా స్వల్పంగా రూ.40 పెరిగి రూ.49,650కి చేరుకుంది.

బంగారంపై అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
ఎంసీఎక్స్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న 10 గ్రాములకు 0.4 శాతం పెరిగి రూ.47,355 పలికింది. వెండి జూలై ఫ్యూచర్స్ 1.19 శాతం తగ్గి కిలోకు రూ.47,861 పలికింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు తగ్గుముఖం పడుతుందనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై ఒత్తిడి తగ్గింది. అలాగే చైనాలో కరోనా అదుపులోకి వస్తుందని వార్తలు వచ్చాయి. అంతర్జాతీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పడటం వంటి కారణాలతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఔన్స్ స్పాట్ గోల్డ్ 0.2 శాతం తగ్గి 1,723.23 డాలర్లకు, గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి 1,730.10 డాలర్లు పలికింది.

అందుకే బంగారం లాభాలు వదులుకోవాల్సి వచ్చింది!
చైనా నుండివస్తున్న సంకేతాల (కోరనా కేసులు తగ్గడం) నేపథ్యంలో బంగారం ఇప్పటి వరకు ఉన్న లాభాలను వదులుకోవాల్సి వచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాల్లో నిరుద్యోగం తగ్గుతోందని, ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications