అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా సోమవారం (డిసెంబర్ 23) బంగారం ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్‌లో 10గ్రాముల ఫ్యూచర్స్ ఫిబ్రవరి 0.29 శాతం లేదా రూ.110 పెరిగి రూ.38,101కి చేరుకుంది. ఫ్యూచర్ మార్చ్ రూ.45,129 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది రూ.225 లేదా 0.5 శాతం పెరిగింది.

ఆ ఒప్పందం తర్వాత బంగారంపై ప్రభావం
అమెరికా - చైనా మధ్య తొలి ఒప్పందం జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. అంతకుముందు గత 17 నెలలుగా ఈ అగ్రదేశాల ఒప్పందం సస్పెన్స్ కారణంగా మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూశాయి. అప్పటి వరకు పూర్తి కన్ఫ్యూజన్‌లో ఉన్న పెట్టుబడిదారులకు ఓ క్లారిటీ వచ్చింది. దీంతో రిస్కర్ అసెట్స్‌పై అప్పటి వరకు వేచి చూసిన వారు ఆ దిశగా మరలారు. దీంతో బంగారంపై లాభాలు కాస్త తగ్గిపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా...
అమెరికా - చైనా తదుపరి వాణిజ్య ఒప్పందంపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో సోమవారం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 0.1 శాతం పెరిగి 1,479.05 డాలర్లుగా ఉంది.

20 శాతం పెరిగిన బంగారం ధర
2019 క్యాలెండర్ ఇయర్‌లో బంగారం ధర ఏకంగా 20 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం ఇది సెప్టెంబర్ నెలలోని గరిష్ట రికార్డ్ స్థాయి రూ.40,000తో పోల్చుకుంటే రూ.2,000 కంటే తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఈ ఏడాది బంగారం ధర భారీగానే పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications