దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో దేశంలో బంగారం ధర ప్రీమియం ఈ వారంలో దాదాపు మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. ఫెస్టివెల్ సీజన్ కావడంతో డిమాండ్ పెరుగుతుందని భావిస్తోన్న రిటైల్ బంగారం వ్యాపారులు స్టాక్స్‌ను సిద్ధం చేసుకున్నాయి. గతవారం ప్రీమియం 1 డాలర్ ఉండగా, ఈసారి 5 డాలర్లకు చేరుకుంది. దేశంలో బంగారం ధరలు దిగుమతి సుంకం 12.5 శాతం, 3 శాతం జీఎస్టీ కూడా ఉంటుంది. దసరా, దీపావళి, ధన్‌తెరాస్ సందర్భంగా బంగారం కొనుగోలును శుభప్రదంగా భావిస్తారు.

కొనుగోలు సెంటిమెంట్ బలపడుతుందని...
బంగారం ధరలు ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికింది. ఆ తర్వాత ధరలు భారీగా తగ్గాయి. గత నెల రోజులకు పైగా పసిడి ధరలు రూ.49,500 నుండి రూ.51,000 మధ్య కాస్త స్థిరంగా కదులుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టం నుండి ధరలు తగ్గడం, గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉండటంతో ఈ పండుగ సీజన్‌లో వ్యాపారం పెరుగుతుందని బంగారం వ్యాపారులు భావిస్తున్నారు. ధరలు స్థిరంగా ఉండటం కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను బలపరిచిందని చెబుతున్నారు.

బంగారం అప్, వెండి డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో శక్రవారం పసిడి ధరలు పెరిగాయి. 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.100 (0.20 శాతం) పెరిగి రూ.50,866 వద్ద ముగిసింది. రూ.51,040 వద్ద గరిష్టాన్ని, రూ.50,643 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.34 (0.07 శాతం) పెరిగి రూ.50,930కి చేరుకుంది.
బంగారం ధర పెరగగా, వెండి ధర క్షీణించింది. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.190 (0.30 శాతం) తగ్గి రూ.62,425 వద్ద ముగిసింది. మార్చి ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలో మార్చి ఫ్యూచర్స్ రూ.26 (0.04 శాతం) పెరిగి రూ.64,128కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో అప్
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ఫ్యూచర్ 0.03 శాతం పెరిగి 1,904 డాలర్లు పలికింది. 1,895.65 - 1,917.25 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు 1904.60 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో బంగారం ధర 24 శాతం మేర పెరిగింది.
వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఔన్స్ వెండి 0.07 శాతం తగ్గి 24.692 డాలర్ల వద్ద ముగిసింది. చివరి సెషన్‌లో 24.503 - 24.973 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 24.823 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి ధర 35 శాతానికి పైగా పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications