For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు, వెండి రూ.68,000 దిగువకు

|

ముంబై: బంగారం, వెండి ధరలు నేడు (జూన్ 28, సోమవారం) స్థిరంగా ఉన్నాయి. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ రెండు నెలల కనిష్టం వద్ద ఉన్నాయి. అదే సమయంలో డిస్కౌంట్ తొమ్మిది నెలల గరిష్టానికి చేరుకుంది. బంగారం ధరలు నేడు రూ.47,000 దిగువనే ఉంది. అలాగే వెండి రూ.68,000 స్థాయి వద్ద ఉంది. గతవారం భారత మార్కెట్లో రిటైల్ గోల్డ్ డిమాండ్ బలహీనంగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డీలర్స్ ఔన్స్ బంగారానికి 12 డాలర్ల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2020 నుండి అదే అత్యధికమని చెబుతున్నారు. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో బంగారం ధర నేడు రూ.9,300 తక్కువగా ఉంది.

స్థిరంగా బంగారం ధరలు

స్థిరంగా బంగారం ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.5.00 (-0.01%) తగ్గి రూ.46920.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,965.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,118.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,865.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.31.00 (0.07%) పెరిగి రూ.47240.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,305.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,397.00 గరిష్టాన్ని, రూ.47,187.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు స్వల్ప పెరుగుదల

వెండి ధరలు స్వల్ప పెరుగుదల

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ మధ్యాహ్నం సెషన్లో రూ.32.00 (0.05%) పెరిగి రూ.67905.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,014.00 వద్ద ప్రారంభమై, రూ.68,344.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,814.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.49.00 (0.07%) పెరిగి రూ.68999.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,098.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,415.00 గరిష్టాన్ని, రూ.68,901.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.05 (0.06%) డాలర్లు తగ్గి 1,776.75 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,770.45 - 1,785.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 0.053 (0.20%) డాలర్లు పెరిగి 26.140 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.845 - 26.293 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు, వెండి రూ.68,000 దిగువకు | Gold price near two month lows, Silver below Rs 68,000

On MCX, gold futures were flat near 2-month low of ₹46,970 per 10 gram while silver rates edged up 0.26% to ₹68,049 per kg.
Story first published: Monday, June 28, 2021, 16:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X