For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు

|

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా తగ్గాయి. కొద్ది రోజులుగా రూ.50,000కు అటు ఇటు కదలుతున్న ధరలు నేడు (బుధవారం, జనవరి 27) రూ.49,000 దిగువకు వచ్చాయి. గత ఏడాది ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7,300 వరకు తక్కువగా ఉంది. బడ్జెట్‌కు ముందు, అలాగే యూఎస్ ఫెడ్ మానిటరీ పాలసీకి ముందు పసిడి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు ప్రస్తుతం నెల రోజుల కనిష్టం వద్ద ఉన్నాయి.

<strong>PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు</strong>PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు

పసిడి ధరలు తగ్గాయి

పసిడి ధరలు తగ్గాయి

నేడు సాయంత్రం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 275.00 (-0.56%) తగ్గి రూ.48,868.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,903.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,948.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,511.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 225.00 (-0.46%) తగ్గి రూ.49,106.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,057.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,170.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,780.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.66,000 వద్ద

వెండి రూ.66,000 వద్ద

సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు కూడా తగ్గాయి. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 407.00 (0.61%) తగ్గి రూ.66128.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,231.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,380.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,051.00 వద్ద కనిష్టాన్ని తాకింది.మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్షీణించింది. రూ.181.00 (0.27%) తగ్గి రూ.67090.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,029.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,060.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1850 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 6.90 (-0.37%) డాలర్లు పెరిగి 1,844.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,828.55 - 1,851.50 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.04% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.245 (-0.96%) డాలర్లు తగ్గి 25.293 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.718 - 25.545 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 39.69శాతం పెరిగింది.

English summary

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు | Gold Price Falls Below Rs.49000 Ahead Of US Fed Monetary Policy Decision

Gold prices in the morning trade on the MCX in the futures market were quoting with losses of over Rs. 250 at Rs.48878 per 10gm. Silver in line also retreated lower by a similar proportion to Rs. 66250 per kg.
Story first published: Wednesday, January 27, 2021, 21:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X