For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, 2 రోజుల్లో రూ.750 పెరిగిన బంగారం: రూ.50,000 దిశగా..

|

ముంబై: బుధవారం భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు (గురువారం, 21, జనవరి) మరోసారి ఎగిశాయి. అమెరికా ఆర్థిక ప్యాకేజీ, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో పసిడి ధరలు రెండు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ నిన్న ఎంసీఎక్స్‌లో రూ.586 (1.20 శాతం) పెరిగి రూ.49,569.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.629.00 (1.29 శాతం) పెరిగి రూ.49,681.00 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,054.00 (1.60%) పెరిగి రూ.67,090.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.1,151.00 (1.72%) ఎగిసి రూ.67930.00 వద్ద క్లోజ్ అయింది.

 Budget 2021: నిర్మలమ్మ ఆదాయ పన్నులో ఈ మార్పులు చేసేనా? Budget 2021: నిర్మలమ్మ ఆదాయ పన్నులో ఈ మార్పులు చేసేనా?

రూ.50వేల సమీపానికి పసిడి

రూ.50వేల సమీపానికి పసిడి

నేడు ఉదయం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 173.00 (0.35%) పెరిగి రూ.49,707.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,699.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,743.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,633.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.6500 వరకు ఉంది. బంగారం ధరలు మళ్లీ రూ.50వేల సమీపానికి చేరుకున్నాయి. ఈ రెండు రోజుల్లో పసిడి ధరలు రూ.750 వరకు పెరిగింది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 173.00 (0.35%) పెరిగి రూ.49,707.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,699.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,743.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,633.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.68వేల దిశగా...

వెండి రూ.68వేల దిశగా...

బంగారం ధరలతో పాటు వెండి ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 495.00 (0.74%) పెరిగి రూ.67485.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,539.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.556.00 (0.82%) పెరిగి రూ.68396.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,377.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,421.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,377.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1875 డాలర్ల సమీపానికి పసిడి

1875 డాలర్ల సమీపానికి పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగి 1875 డాలర్లకు సమీపానికి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 5.20 (+0.28%) డాలర్లు పెరిగి 1,871.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,866.75 - 1,872.65 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 17.88% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.242 (+0.94%) డాలర్లు పెరిగి 25.995 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.770 - 26.065 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 43.62శాతం పెరిగింది.

English summary

ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, 2 రోజుల్లో రూ.750 పెరిగిన బంగారం: రూ.50,000 దిశగా.. | Gold off 2 week high as investors book profits

Gold eased from a two-week high on Thursday as investors booked profits after prices jumped in the previous session on hopes of a massive U.S. stimulus package under the new Joe Biden administration.
Story first published: Thursday, January 21, 2021, 10:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X