బంగారం దిగుమతుల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో బంగారం దిగుమతులు ఏడాది ప్రాతిపదికన తొమ్మిది శాతం తగ్గి 24.64 బిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. దేశీయ కరెన్సీలో ఇది రూ.1.74 లక్షల కోట్లుగా ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

తగ్గుముఖం పట్టిన దిగుమతులు
అంతకుముందు ఏడాది (2018-19) ఇదే సమయంలో దిగుమతులు 27 బిలియన్ డాలర్లుగా ఉంది. బంగారం దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్యలోటు 133.27 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే వాణిజ్యలోటు 163.27 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది జూలై నుంచి బంగారం దిగుమతులు తగ్గుతున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రం అంతకుముందు ఏడాది కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి.

ద్రవ్యలోటు కట్టడి కోసం..
పసిడి డిసెంబర్ నెలలో 4 శాతం, జనవరిలో 31.5 శాతం మేర ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. ఇండియాలో ఆభరణాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. భారత్ ప్రతి ఏటా 800 టన్నుల నుండి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు దిగుమతులపై విధించే పన్నును గత ఏడాది 10% శాతం నుంచి 12.5% పెంచింది.

వర్తకుల డిమాండ్
బంగారం వర్తకులు ఈ పన్నును 4% తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. గత పది నెలల్లో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు కూడా 1.45% తగ్గి 25.11 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2018-19లో భారత్ 32.8 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3% తక్కువ.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications