2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. ఏడాది ప్రాతిపదికన జూన్ నెలలోను 86 శాతం వరకు పడిపోయాయి. ఏప్రిల్ - మే నెలల్లో పసిడి దిగుమతులు 79.14 మిలియన్ డాలర్లు (రూ.600 కోట్లకు పరిమితమయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో దిగుమతులు 8.75 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా సమయంలో డిమాండ్ మందగించడంతో ప్రభావం పడింది.

డిసెంబర్ నుండి తగ్గుదల
బంగారం దిగుమతులు తగ్గడంతో ఏప్రిల్, మే నెలల్లో దేశ వాణిజ్య లోటు 9.91 బిలియన్ డాలర్లకు దిగి వచ్చింది. ఏడాదిక్రితం ఇది 30.7 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరి - మార్చి క్వార్టర్‌లో కరెంట్ ఖాతా లోటు కూడా అదుపులోకి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ నుండి పసిడి దిగుమతులు వరుసగా తగ్గుతున్నాయి. మార్చిలో 62.6 శాతం, ఏప్రిల్‌లో 99.93 శాతం, మే నెలలో 98.4 శాతం తగ్గాయి.

వజ్రాల ఎగుమతులు తగ్గాయి
ఇండియా ప్రతి సంవత్సరం దాదాపు 800 టన్నుల నుండి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇక, ఏప్రిల్ - మే నెలలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 82.46 శాతం మేర తగ్గి 1.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. వెండి దిగుమతులు 30.7 శాతం తగ్గి 437.89 మిలియన్ డాలర్లకు పడిపోయాయి.

జూన్ నెలలోను తగ్గిన పసిడి దిగుమతులు
బంగారం దిగుమతులు జూన్ నెలలో కూడా 86 శాతం తగ్గాయి. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు లాక్ డౌన్, అధిక ధరలు, దుకాణాల మూత వంటి వివిధ కారణాలతో భారీగా తగ్గాయి. అయితే అంతకుముందు ఏప్రిల్, మే కంటే కొద్దిగా పెరిగింది. జూన్ నెలలో 11 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ఏడాది క్రితం ఇదే నెలలో 77.73 టన్నుల బంగారం దిగుమతి అయింది. వ్యాల్యూపరంగా జూన్ దిగుమతులు 2.7 బిలియన్ డాలర్ల నుండి 608.76 మిలియన్ డాలర్లకు తగ్గాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications