ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. జూన్ త్రైమాసికంలో 76.1 టన్నుల గోల్డ్ డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది ఇదే కాలంలో 63.8 టన్నులతో పోలిస్తే ఇది 19.2 శాతం వృద్ధి నమోదు చేసింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే డిమాండ్ 46 శాతం క్షీణించింది. గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా జ్యువెల్లరీ దుకాణాలు సహా అన్నీ బంద్ ఉన్నాయి. దీంతో అమ్మకాలపై ప్రభావం పడింది. కరోనా సెకండ్ వేవ్ పరిణామాల వల్ల ఈసారి కూడా సేల్స్ కాస్త తగ్గాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలోను డిమాండ్ కనిపించలేదని వెల్లడించింది.
వ్యాల్యూ ప్రకారం ఈ క్యాలెండర్ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.32,810 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.26,600 కోట్లతో పోలిస్తే 23 శాతం అధికం. 2021 క్యాలెండర్ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో 157.6 టన్నుల డిమాండ్ కనిపించగా, 2019 ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం అధికం. జూన్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 25 శాతం పెరిగి 55.1 టన్నులకు చేరుకుంది. వ్యాల్యూ పరంగా 29 శాతం వృద్ధి నమోదు చేసి 23,750 కోట్లకు చేరుకుంది.
పెట్టుబడుల పరంగా బంగారం డిమాండ్ ఆరు శాతం పెరిగి 21 టన్నులుగా నమోదయింది. వ్యాల్యూపరంగా 10 శాతం వృద్ధితో రూ.8250 కోట్ల నుండి రూ.9060 కోట్లకు చేరుకుంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే డిమాండ్ మళ్లీ భారీగా పుంజుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది. వ్యాక్సీన్ వేగం, సీరో సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లుగా తేలుతోందని, ఈ నేపథ్యంలో విక్రయాలు మళ్లీ పుంజుకుంటాయని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న భారీగా పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు అతి స్వల్ప తగ్గుదల లేదా స్థిరంగా ఉంది.దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో గత రెండు నెలల కాలంలో ఈ వారంలోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న ఏకంగా 1830 డాలర్లను దాటి 1850 డాలర్ల దిశగా కనిపించింది. అయితే నేడు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసింది.
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000ను క్రాస్ చేసింది. నిన్న రూ.48,300కు సమీపంలో ముగిసింది. నేడు మధ్యాహ్నం సెషన్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48.00 క్షీణించి రూ.48,233.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48412.00 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.34.00 నష్టపోయి రూ.68166.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.42.00 క్షీణించి రూ.69004.00 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర నేడు మధ్యాహ్నం సమయానికి 1828 డాలర్ల వద్ద కదలాడింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో 2.60 డాలర్లు తగ్గి 1,828.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.134 డాలర్లు క్షీణించి 25.648 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications