అమెరికా ప్రభుత్వం ఇటీవలే కొన్ని దిగుమతులపై పన్నులను గణనీయంగా పెంచింది. ఈ నిర్ణయం వాణిజ్య రంగంలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా, భారత్ నుంచి అమెరికాకు వెళ్తున్న కొన్ని ఉత్పత్తులపై అదనపు పన్నులు విధించడంతో, దేశీయ పరిశ్రమలు కొత్త వ్యూహాలు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.

అమెరికా మార్కెట్ ఎప్పటి నుంచో భారత ఎగుమతులకి పెద్ద ఆదాయ వనరు. కానీ అధిక పన్నుల కారణంగా ఉత్పత్తుల ధరలు అక్కడ పెరగడం సహజం. దీని వల్ల అమెరికా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో భారత వ్యాపారులు రెండు ప్రధాన మార్గాలను పరిశీలిస్తున్నారు.
కొత్త దేశాల వైపు మళ్లడం వల్ల యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కొత్త మార్కెట్లను అన్వేషించడం. ఉత్పత్తులపై ఆధారపడకుండా, కొత్త రకాల ఉత్పత్తులు తయారు చేసి ఎగుమతి చేయడం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది తాత్కాలిక ఆటంకమే అయినప్పటికీ, దీని వలన భారత పరిశ్రమలు దీర్ఘకాలంలో మరింత బలపడతాయి. ఎందుకంటే కొత్త మార్కెట్లు, విభిన్న ఉత్పత్తులు కలిగి ఉండడం వాణిజ్య భద్రతకు అవసరం. ఈ పన్నుల పెంపు భారత వ్యాపారులకు ఒక సవాలుగా ఉన్నప్పటికీ, దానిని అవకాశంగా మలచుకునే దిశగా ఇప్పటికే వ్యూహాత్మక చర్యలు మొదలయ్యాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి ప్రపంచానికి ఎగుమతవుతున్న ఉత్పత్తుల్లో, ఇంధనాలు, ఆయిల్, డిస్టిలేషన్ ఉత్పత్తులు అత్యధికంగా ఉన్నాయి. వీటి విలువ 74.27 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదైంది. తర్వాత స్థానంలో 39.36 బిలియన్ డాలర్ల విలువ గల ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. మూడో స్థానంలో 32.01 బిలియన్ డాలర్ల విలువ గల యంత్రాలు, అణు రియాక్టర్లు, బాయిలర్లు ఉన్నాయి. నాలుగో స్థానంలో ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు 29.25 బిలియన్ డాలర్ల ఎగుమతులతో నిలిచాయి.
ఔషధ ఉత్పత్తులు 22.98 బిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో ఉన్నాయి. రైల్వే, ట్రామ్ వాహనాలు మినహా ఇతర వాహనాలు 21.75 బిలియన్ డాలర్ల ఎగుమతులతో ఆరో స్థానంలో ఉన్నాయి. ఆర్గానిక్ కెమికల్స్ 20.69 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో ఉండగా, ధాన్యాలు 11.93 బిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఇనుము, ఉక్కు 10.18 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా, ఇనుము లేదా ఉక్కుతో తయారైన వస్తువులు 9.93 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పదవ స్థానంలో నిలిచాయి.
ఒకప్పుడు భారత్ ప్రధానంగా పత్తి, టీ, కాఫీ వంటి వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేసేది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి విభిన్న రంగాల ఉత్పత్తులు కూడా టాప్ లిస్టులో ఉన్నాయి. భారత జనరిక్ మెడిసిన్ ఉత్పత్తులు అమెరికా, యూరప్ దేశాలకు విస్తృతంగా ఎగుమతి అవుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోందే కాకుండా, 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్' అనే పేరును బలపరుస్తోంది.
బియ్యం, గోధుమ, పప్పులు, మసాలాలు వంటి ఉత్పత్తులకు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగింది. డిజిటల్ ఎగుమతుల ప్రాధాన్యం సాఫ్ట్‌వేర్ సర్వీసులు, ఐటి కన్సల్టింగ్, ఆన్‌లైన్ సొల్యూషన్లు కూడా విదేశీ మారక ద్రవ్య ప్రవాహంలో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ మార్పులు, రవాణా ఖర్చుల పెరుగుదల, వాణిజ్య యుద్ధాలు, కరెన్సీ మార్పిడి రేటు లాంటి అంశాలు ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications