ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ స్టోర్ల సంస్థ వాల్మార్ట్ కు ఇండియాలో చుక్కెదురైంది. ఇటీవల వాల్మార్ట్ ఇండియా కొంత మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది ఉద్యోగులు కంపెనీ చర్యను తప్పుబడుతూ మాతృ సంస్థ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తమ తొలగింపు అన్యాయమని, అది పనితీరును ఆధారంగా చేసుకుని జరిగింది కాదని ఇటీవల ఉద్వాసనకు గురైన కొంత మంది ఉద్యోగులు వాల్మార్ట్ ఇండియా పై తిరగబడ్డారు.
కంపెనీలో లే ఆఫ్స్ ఉండబోవని, ఇటీవలే (గత డిసెంబర్ నెలలో) హామీ ఇచ్చి, అంతలోనే ఉద్యోగంలోంచి తొలగించటం ఏంటని వారు ప్రశ్నించారు. తొలగింపునకు గురైన వారిలో సుమారు 40 మంది అమెరికా లోని బెంటెంవిల్లా లోని వాల్మార్ట్ హెడ్ క్వార్టర్‌కు విడివిడిగా లేఖలు రాశారు. అలాగే ఒక గ్రూపుగా చేరి సంయుక్తంగానూ ఫిర్యాదు చేసారు. వాల్మార్ట్ ఇండియా ఇటీవలి కాలంలో చేసుకున్న రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లోని లొసుగులను కూడా వారి ఫిర్యాదుల్లో వివరించినట్లు తెలిసింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.

త్వరలోనే విచారణ....
ఇటీవల ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ లో వాల్మార్ట్ ఇండియా 100 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు. అది జనవరి 13న ప్రచురితమైంది. ఆ మరుసటి రోజే మరో 56 మందిని కూడా ఉద్యోగం వీడాలని కంపెనీ ఆదేశాలు వచ్చాయని సమాచారం. అయితే, తొలగింపునకు గురైన ఉద్యోగులు రాసిన ఉత్తరాలకు అమెరికా లోని వాల్మార్ట్ స్పందించినట్లు తెలిసింది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు అమెరికా కంప్లియన్సు అండ్ ఎథిక్స్ డిపార్ట్మెంట్ కు చెందిన బృందం ఒకటి త్వరలోనే ఇండియాకు రానున్నట్లు వినికిడి. ఆ బృందం అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరపనున్నట్లు సమాచారం. అది జరిగితే అసలు విషయం బయటకు తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇండియాలో విస్తరణకు స్వస్థి ...
ఇండియాలో కార్యకలాపాలు పెద్దగా లాభసాటిగా లేకపోవటంతో వాల్మార్ట్ ఇక్కడి కార్యకలాపాలన పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైలోని తన అతిపెద్ద ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ (వేర్ హౌస్) ను మూసివేసింది. అలాగే దేశంలో కొత్త స్టోర్ల విస్తరణ ను నిలిపివేసింది. రూ 1 లక్ష కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన ఫ్లిప్కార్ట్ తో బ్యాక్ ఎండ్ కార్యకలాపాలను అనుసంధానం చేస్తోంది. తద్వారా ఇండియాలో వ్యయాలను కట్టడి చేయాలనీ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే వాల్మార్ట్ ఇండియాలో ఉద్యోగులను కూడా తొలగిస్తోంది. ఫ్లిప్కార్ట్ తాజాగా ఫుడ్ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్న సమయంలోనే ఉద్యోగుల తొలగింపు జరుగుతుండటం గమనార్హం. ఫార్మర్ మార్ట్ పేరుతో ఫ్లిప్కార్ట్ త్వరలోనే స్థానికంగా పండించిన ఆహార పదార్థాలను ఆన్లైన్ లో విక్రయిచబోతోంది. ఆన్లైన్ తో పాటు స్టోర్ల నూ ఫుడ్ ఐటమ్స్ ను సేల్ చేయాలనీ ఫ్లిప్కార్ట్ భావిస్తున్నట్లు సమాచారం.

స్పందించిన కంపెనీ...
ప్రస్తుతం తొలగించిన ఉద్యోగుల అంశంపై వాల్మార్ట్ ఇండియా స్పందించింది. తమ కంపెనీ కంప్లియన్సు, కల్చర్, ఇంటెగ్రిటీ కు అనుగుణంగా పటిష్టమైన విధానాలు అమలు చేస్తామని తెలిపింది. ఎలాంటి ఆరోపణలు ఐనా తీవ్రంగానే పరిగణించి, అందుకు అనుగుణంగా వాటిని సమీక్షిస్తామని వెల్లడించింది. ఇండియాలో తాము వృద్ధి చెందేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ క్రమంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, స్థానిక ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అమలు చేస్తామని, అందులో భాగంగా స్థానిక చట్టాలను వారి ప్రయోజనం కలిగేలా అమలు చేయటానికి బద్ధులమై ఉంటామని పేర్కొంది. చూడాలి మరి ఇక ముందు వాల్మార్ట్ కార్యకలాపాలు ఇండియాలో ఎలా కొనసాగుతాయో, ఉద్యోగులతో నెలకొన్న వివాదం ఎప్పుడు సమిసిపోతుందో.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications