కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం దాదాపు రెండు నెలలుగా దేశంలో లాక్ డౌన్ విధించింది. అయితే, ఈ నెల 31తో తర్వాత దానిని పూర్తిగా ఎత్తివేసే సంకేతాలు ఇచ్చింది. ఎందుకంటే... ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ 4.0 లో చాలా సడలింపులు ఇచ్చారు. రెడ్ జోన్లు మినహా ఆరంజ్, గ్రీన్ జోన్ల లో ఇప్పటికే కార్యకలాపాలు మునుపటిలా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
తెలంగాణ లో నిన్నటి నుంచి బస్సు సర్వీస్ లు కూడా ప్రారంభమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ కూడా బస్సులు నడపనుంది. దీంతో దాదాపు లాక్ డౌన్ ఎత్తివేసినట్లే అవుతోంది. కానీ, ఈ లాక్ డౌన్ ఎత్తివేసినా ... మన దేశంతో పాటు ప్రపంచమంతా కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతుండగా... దాని ప్రభావం ఇండియా ఎక్సపోర్ట్స్ పై పడబోతోంది.
దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి జరిగే ఎగుమతులు భారీగా పడిపోనున్నాయి. కాబట్టి దేశం ఆర్జించే విదేశీ మారక ద్రవ్యంపై కూడా ఆ మేరకు ప్రభావం పడబోతోంది. అదే సమయంలో దేశంలో ఉపాధి కల్పన అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది.

20% తరుగుదల...
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజషన్స్ (ఎఫ్ ఐ ఈ ఓ ) ప్రకారం... 202-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు సుమారు 20% తగ్గబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 20% వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. విలువ పరంగా చూస్తే వీటి విలువ దాదాపు 50 బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది అని ఎఫ్ ఐ ఈ ఓ డైరెక్టర్ జనరల్ & సీఈఓ అజయ్ సహాయ్ వెల్లడించారు. అయితే, కరోనా ప్రభావంతో దిగుమతులు కూడా తగ్గటంతో దేశ బాలన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితి పై దుష్పరిణామం ఎక్కువగా ఉండకపోవచ్చని చెప్పారు.

జాబ్ లాస్...
మన దేశం నుంచి జరిగే ఎగుమతులు తగ్గిపోతున్నప్పుడు ఆ ప్రభావం దేశంలో ఉపాధి కల్పనపై కూడా పడనుంది. దీంతో ఇండియాలో ఈ రంగంలో జాబ్ లాస్ కు ఆస్కారం ఉన్నట్లు అజయ్ సహాయ్ అభిప్రాయపడ్డారు. భారత ఎగుమతుల రంగం దేశం లో కొన్ని కోట్ల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది.
తయారీ రంగంలోని సుమారు 40% ఉద్యోగాల కల్పన కేవలం ఎగుమతుల ఆధారిత పరిశ్రమల ద్వారా లభిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ పై పెదవి విరిచిన అయన... చైనాలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభం అయింది కాబట్టి, ప్రపంచ మార్కెట్లలో మనం మెరుగ్గా పోటీ పడాలంటే ప్రోత్సాహం అవశ్యం అని చెప్పారు. వ్యక్తిగతంగా చూస్తే... ఆ ప్యాకేజీ లో ఎగుమతుల రంగం గురించి ఒక్క మాట కూడా లేదని అయన విచారం వ్యక్తం చేశారు. అయితే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వడ్డీ రాయితీ వంటి అంశం కొంత ఉపశమనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

320 బిలియన్ డాలర్లు...
ఏటా భారత్ నుంచి జరిగే వాణిజ్య ఎగుమతులు మన జీడీపీ లో సుమారు 12% నికి సమానంగా ఉంటాయి. సుమారు 320 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతాయి. అయితే ప్రస్తుతం రూపాయి విలువ కొంత పతనం అయినప్పటికీ... ప్రపంచ మార్కెట్లలో ఇండియా కు పోటీ దేశాలైన ఇండోనేషియా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రెజిల్ దేశాలతో పోల్చితే అది తక్కువగా ఉంది. కాబట్టి మన ఉత్పత్తులకు పోటీ అధికంగా ఉండబోతోంది.
అలాగే చైనాలో కూడా తమ ఎగుమతులపై రిబేట్లు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. కాబట్టి, ఎగుమతులు చేసే అన్ని సంస్థలకు 2% వడ్డీ రాయితీ, ఎక్కువ లేబర్ అవసరం అయ్యే అప్పారెల్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్లు, లెదర్, మెరైన్, టీ, ప్రొసెస్డ్ ఫుడ్ రంగాలకు 4% వడ్డీ రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అజయ్ సహాయ్ వెల్లడించారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications