పసిడి ప్రియులకు పండుగ: వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధరలు; నేడు ధరలిలా!!
పసిడి ప్రియులకు శుభవార్త. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు కాస్త దిగివస్తున్నాయి. బంగారం ధరలు నేడు వరుసగా మూడో రోజు తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెబుతున్నారు నిపుణులు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ సంవత్సరం ధరలు దాదాపు ఆరంభం నుండి కొండెక్కి కూర్చున్నాయి.
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక తాజాగా దేశీయంగా బంగారం ధరలు నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 100 రూపాయలు తగ్గి ప్రస్తుతం 55,550 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 110 రూపాయలు తగ్గి 60, 600 రూపాయల వద్ద బంగారం నేడు ట్రేడవుతోంది.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు విషయానికి వస్తే హైదరాబాద్ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,550 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60, 600గా ప్రస్తుతం ట్రేడవుతోంది.దేశ రాజధాని ఢిల్లీ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55 వేల 650 రూపాయలు గా ట్రేడ్ అవుతుంటే, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60 వేల 750 రూపాయలుగా ట్రేడవుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,550 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 600 గా ప్రస్తుతం ట్రేడవుతోంది. బెంగళూరు లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 600 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,650 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కాకినాడ, రాజమండ్రిలలో 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ధర 55,550 రూపాయలు కాగా, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 60 వేల 600 రూపాయలుగా ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications