For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్ధిక వ్యవస్దకు మరో శుభ సంకేతం- గత క్వార్టర్‌లో రెట్టింపైన ఎఫ్‌డీఐలు- 28.1 బిలియన్లకు

|

కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలన్నీ కుదేలయ్యాయి. ఇతర దేశాలతో పాటు భారత ఆర్ధిక వ్యవస్ధ కూడా కుప్పకూలింది. లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటించినప్పటికీ మన ఆర్దిక వ్యవస్ధకు పునర్‌ వైభవం వస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. కానీ తాజాగా ముగిసిన జూన్‌-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఆర్ధిక వ్యవస్దకు ఊతమిచ్చే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరగడం. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రెట్టింపు కావడం ఆర్దిక వ్యవస్ధకు శుభసూచికంగా కనిపిస్తోంది.

దేశీయ ఈ కామర్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్రం అడుగులు.. రూల్స్ ఫ్రేమ్ చేసేందుకు నిపుణుల కమిటీ దేశీయ ఈ కామర్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్రం అడుగులు.. రూల్స్ ఫ్రేమ్ చేసేందుకు నిపుణుల కమిటీ

విదేశీ పెట్టుబడుల ప్రవాహం..

విదేశీ పెట్టుబడుల ప్రవాహం..

భారత్‌లో కరోనా కల్లోలం తర్వాత ఆర్ధిక వ్యవస్ద ఇప్పట్లో తిరిగి కోలుకుంటుందంటే నమ్మే పరిస్ధితి లేదు. కరోనా కారణంగా కుదేలైన ఆర్ధిక వ్యవస్ధ, ఎటు చూసినా నిరాశాజనక పరిస్దితులు, లక్షల్లో పోయిన ఉద్యోగాలు, నష్టాలతో దివాలా తీస్తున్న కార్పోరేట్ సంస్ధలు.. ఇలా ప్రతీ విషయంలోనూ భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేవీ ఫలితాన్నిచ్చే పరిస్ధితులు లేవు. కానీ తాజాగా ముగిసిన జూన్‌-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఒకే ఒక్క విషయంలో భారత్‌ మేటిగా నిలిచింది. అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఈ ఒక్క అంశంలో మాత్రం భారత్‌ ఆశాజనక ఫలితాన్ని అందుకుంది.

రెట్టింపైన విదేశీ పెట్టుబడులు..

రెట్టింపైన విదేశీ పెట్టుబడులు..

కరోనా సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్ధ కుదేలవుతున్నప్పటికీ మన దేశంపై విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం మాత్రం సడలిపోలేదు. దీంతో గతేడాదితో పోలిస్తే రెట్టింపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌కు తరలివచ్చాయి. తాజాగా ముగిసిన త్రైమాసికంలో భారత్‌కు ఏకంగా 28.1 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. గతేడాది ఇదే సమయంలో మన దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 14.6 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అంతకుముందు క్వార్టర్‌తో కలుపుకుంటే ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య ఎఫ్‌ఐడీల విలువ 30 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దీంతో ఆర్ధిక వ్యవస్దకు ఇదో పెద్ద ఊతం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈక్విటీ ఇన్‌ఫ్లోలో హెచ్చు తగ్గులు

ఈక్విటీ ఇన్‌ఫ్లోలో హెచ్చు తగ్గులు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఈక్విటీల్లోనూ భారత్‌ మెరుగ్గా ఉన్నా హెచ్చుతగ్గులు మాత్రం తప్పడం లేదు. ఈ ఏడాది జూలైలో ఎఫ్‌డీఐ ఈక్విటీ 3.04 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. ఆగస్టులో ఇది 17.48 బిలియన్‌ డాలర్లకు చేరింది. సెప్టెంబర్‌లో 2.9 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లో 8.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా, యుఎస్ (7.12 బిలియన్ డాలర్లు) రెండవ స్థానంలో ఉంది. కేమన్ దీవులు (2.1 బిలియన్ డాలర్లు), మారిషస్ (2 బిలియన్ డాలర్లు), నెదర్లాండ్స్ (1.49 బిలియన్ డాలర్లు), యుకె (1.35 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (1.13 బిలియన్ డాలర్లు) మరియు జపాన్ (653 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.

ఈ రంగాల్లోకి విదేశీ పెట్టుబడులు

ఈ రంగాల్లోకి విదేశీ పెట్టుబడులు

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న అగ్ర రంగాలలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ (.5 17.55 బిలియన్), సేవలు (25 2.25 బిలియన్), ట్రేడింగ్ (49 949 మిలియన్), రసాయనాలు (437 మిలియన్ డాలర్లు), ఆటోమొబైల్ (7 417 మిలియన్), నిర్మాణ కార్యకలాపాలు (7 377 మిలియన్) ), మందులు మరియు ఫార్మా (7 367 మిలియన్లు) ఉన్నాయి.

ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

English summary

ఆర్ధిక వ్యవస్దకు మరో శుభ సంకేతం- గత క్వార్టర్‌లో రెట్టింపైన ఎఫ్‌డీఐలు- 28.1 బిలియన్లకు | FDI inflows double in the July-Sept quarter to $28.1 billion

The total Foreign Direct Investment (FDI) inflow into India doubled to $28.1 billion in the July-September quarter this fiscal, from $14.06 billion in the same period last year.
Story first published: Saturday, November 28, 2020, 16:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X