కొత్త ట్యాక్స్ స్కీం, ఐటీ అధికారుల్లో టెన్షన్: సీబీడీటీ చైర్మన్ హామీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ఫేస్‌మెంట్ అప్పీల్ నేపథ్యంలో తమ ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుందేమోనని ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఉద్యోగ కోతలు, పెద్ద ఎత్తున బదలీలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇది వారిలో టెన్షన్‌ను పెంచింది. దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) చైర్మన్ పీసీ మోడీ స్పష్టత ఇచ్చారు. వారి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.

ఉద్యోగాల కోతలేదు, బదలీల్లేవు
ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ఫేస్‌మెంట్ అప్పీల్ కారణంగా ఎలాంటి ఉద్యోగాల కోత ఉండదని, అలాగే భారీ స్థాయిలో బదలీలు కూడా ఉండవని పీసీ మోడీ తేల్చి చెప్పారు. బుధవారం ఐటీ అధికారులతో పీసీ మోడీ, బోర్డు ఉన్నతాధికారులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడున్న మానవవనరులు ప్రస్తుత ప్రాంతాల్లోనే ఉంటాయని ఐటీ అధికారులకు హామీ ఇచ్చారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ స్కీం దేశవ్యాప్త అమలుపై ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని చెప్పారు.

అపోహలు తొలగించే ప్రయత్నం
ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ ద్వారా ఐటీ అధికారుల్లో కలిగిన అపోహలు, ఆందోళనలు తొలగించేందుకు సీబీడీటీ చైర్మన్ ప్రయత్నించారని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు పెండింగ్‌లోని డిమాండ్స్‌పై కూడా దృష్టి సారించాలని ఈ సమావేశంలో సూచించారు.

పన్ను సంస్కరణలు
'పారదర్శక పన్నువిధానం - నిజాయితీపరులకు గౌరవం'ను ఆగస్ట్ 13వ తేదీన ప్రధాని మోడీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి పన్ను సంస్కరణల్లో భాగంగా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ఫేస్‌లెస్ అప్పీల్, ట్యాక్స్ పేయర్ చార్టర్‌ను అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్ గురువారం నుండి అమల్లోకి రాగా, ఫేస్‌లెస్ అప్పీల్ సెప్టెంబర్ 25వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ సిస్టం ద్వారా ట్యాక్స్ పేయర్స్‌కు ఎంతో ప్రయోజనం. ట్యాక్స్ పేయర్ చార్టర్ పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను నిర్వచిస్తుంది.


Click it and Unblock the Notifications