ఎగుమతులు తగ్గాయి, దిగుమతులు పెరిగాయ్: వాణిజ్యలోటు 25% పెరిగింది
2020 డిసెంబర్ నెలలో ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరిగాయి. దీంతో భారత వాణిజ్యలోటు 15.71 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లోను ఎగుమతులు తగ్గిన విషయం తెలిసిందే. గత నెలలో తగ్గడంతో వరుసగా మూడు నెలలు క్షీణించాయి. డిసెంబర్ నెలలో రూ.0.8 శాతం పతనమై 2,689 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, లెదర్, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించడమే ఇందుకు కారణం. దిగుమతులు 7.6 శాతం పెరిగి 4,160 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.

ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరిగాయి
ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడంతో గత నెలలో (డిసెంబర్ 2020) వాణిజ్య లోటు 25.58 శాతం పెరిగి 1571 కోట్ల డాలర్లుగా నమోదయింది. 2019 డిసెంబర్ నెలలో ఎగుమతులు 2711 కోట్ల డాలర్లు కాగా, దిగుమతులు 3950 కోట్ల డాలర్లుగా ఉంది. పెట్రోలియం, తోలు, మెరైన్ ఉత్పత్తుల్లో క్షీణత నమోదు కావడంతో ఎగుమతులు తగ్గాయి. ఇక దిగుమతులు ఫిబ్రవరి తర్వాత తొలిసారి పెరిగాయి. డిసెంబర్ నెలలో ఎగుమతుల క్షీణత వల్ల వాణిజ్యలోటు ఎగబాకింది. 2020లో జూలై తర్వాత ఇదే అత్యధిక వాణిజ్యలోటు.

ఎగుమతులు ఇలా...
డిసెంబర్ నెలలో చమురు దిగుమతులు 10.37 శాతం తగ్గి రూ.70,241 కోట్లకు చేరాయి. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో చమురు దిగుమతులు 44.46 శాతం పడిపోయి రూ.3,92,578 కోట్లగా నమోదయింది. ఎగుమతుల్లో ఆయిల్ మీల్స్ అత్యధికంగా 192 శాతానికి పైగా వృద్ధి నమోదు చేసింది. ఐరన్ ఓర్ 69 శాతం, కార్పెట్ 21.12 శాతం, ఫార్మాస్యూటికల్స్ 17.44 శాతం, సుగంధద్రవ్యాలు 17.06 శాతం, ఎలక్ట్రానిక్ గూడ్స్ 16.44 శాతం, పండ్లు, కూరగాయలు 12.82 శాతం, రసాయనాలు 10.73 శాతం, చేనేత ఉత్పత్తులు 10.09 శాతం, బియ్యం 8.60 శాతం, మాంసం-డైరీ-పౌల్ట్రీ ఉత్పత్తులు 6.79 శాతం, రత్నాభరణాల 6.75 శాతం ఎగుమతుల్లో కూడా సానుకూల వృద్ధి రేటు నమోదయింది.

దిగుమతులు ఇలా...
దిగుమతుల విషయానికి వస్తే పప్పుధాన్యాలు అత్యధికంగా 245.15 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. బంగారం 81.82 శాతం, వెజిటబుల్ ఆయిల్ 43.50 శాతం, రసాయనాలు 23.30 శాతం, ఎలక్ట్రానిక్ వస్తువులు 20.90 శాతం, మెషీన్ టూల్స్ 13.46 శాతం, ముత్యాలు, రత్నాలు 7.81 శాతం, ఎరువుల 1.42 శాతం దిగుమతుల్లోను సానుకూల వృద్ధి నమోదయింది.


Click it and Unblock the Notifications