ఎగుమతులు 6.2 శాతం, దిగుమతులు 2 శాతం జంప్: వాణిజ్య లోటు ఎంతంటే
2021 జనవరి నెలలో భారత్ ఎగుమతులు 6.2 శాతం, దిగుమతులు 2 శాతం పెరిగాయి. ఎగుమతులు, దిగుమతులు వరుసగా రెండో నెల పెరిగాయి. కరోనా కారణంగా గత ఏడాది ఏప్రిల్ నెల నుండి ఎగుమతులు, దిగుమతులు పడిపోయిన విషయం తెలిసిందే. అన్-లాక్ అనంతరం క్రమంగా రికవరీ అవుతోంది. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులు పెరుగుతున్నాయి.

ఎగుమతులు వృద్ధి
వరుసగా రెండో నెలలోనూ ఎగుమతులు వృద్ధిబాట పట్టాయి. జనవరిలో భారత్ ఎగుమతులు 6.16 శాతం వృద్ధి సాధించి రూ.2.03 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఫార్మా, ఇంజనీరింగ్ రంగాల ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉండటంతో వృద్ధి నమోదయినట్లు చెబుతున్నారు. దీంతో జనవరిలో వాణిజ్య లోటు 1,530 కోట్ల డాలర్ల నుంచి 1,454 కోట్ల డాలర్లకు తగ్గింది. ఇక, దిగుమతులు మాత్రం 2 శాతం పెరిగి 4,200 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.

దిగుమతులు కూడా 2 శాతం వృద్ధి
2020 జనవరితో పోలిస్తే గత నెలలో ఎగుమతులు 6.16 శాతం పెరిగి రూ.2.05 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతులు కూడా 2 శాతం పెరిగి 4,200 కోట్ల డాలర్ల చేరుకున్నాయి. ఔషధ, ఇంజినీరింగ్ ఎగుమతులు వరుసగా 16.4 శాతం, 19 శాతం చొప్పున పెరిగాయి. చమురు, ముడి ఇనుము, పొగాకు, బియ్యం, పండ్లు, కూరగాయలు, కార్పెట్లు, హస్తకళలు, మసాలాలు, టీ, జీడిపప్పు, ప్లాస్టిక్, రసాయనాల రంగాలు సైతం వృద్ధి సాధించాయి.

ఇవి తగ్గాయి
పెట్రోలియం ఉత్పత్తులు 32 శాతం, రెడీమేడ్ దుస్తులు -10.73 శాతం, తోళ్లు 18.6 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. బంగారం దిగుమతులు 155 శాతం పెరిగి 400 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. చమురు దిగుమతులు 1301 కోట్ల డాలర్ల నుండి 27.72శాతం తగ్గి 940 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications