ముంబై: దేశంలోనే అతిపెద్ద లైసెన్స్‌డ్ సర్టిఫైడ్ అథారిటీ ఇ-ముద్ర లిమిటెడ్ జారీ చేసిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్.. ఇవ్వాళ లిస్ట్ కానుంది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఇంకొన్ని గంటల్లో లిస్టింగ్ అవుతుంది. ఐపీఓ బుక్ రన్నింగ్ సమయంలో గ్రే మార్కెట్ అంచనాలు కాస్త నెగెటివ్‌గా కనిపించిన నేపథ్యంలో- అవి ఎంతవరకు నిజమౌతాయనేది తేలిపోతుంది. గ్రూప్ బీ సెక్యూరిటీస్‌లో స్పెషల్ ప్రీ-ఓపెన్ సెషన్ సందర్భంగా లిస్టింగ్ ప్రకటన వెలువడుతుంది. జీఎంపీకి భిన్నంగా స్టాక్ మార్కెట్ నిపుణుల అంచనాలు వెలువడుతున్నాయి. ఇ-ముద్ర షేర్లు పాజిటివ్‌గా లిస్టింగ్ అవ్వొచ్చని చెబుతున్నారు.
పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా ఇన్వెస్టర్ల నుంచి మొత్తం 421.79 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనే ఉద్దేశంతో ఇ-ముద్ర లిమిటెడ్.. ఐపీఓకు వచ్చిన విషయం తెలిసిందే. కంపెనీ మొత్తం రెండుగా డివైడ్ అయిన తరువాత ఐపీఓకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డిజిటల్ ట్రస్ట్ సర్వీసెస్, ఎంటర్‌ప్రైజెస్ సొల్యూషన్స్‌గా వేర్వేరుగా ఏర్పాటైంది. తాజా ఈక్విటీలను జారీ చేయడం ద్వారా 161 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనేది మేనేజ్‌మెంట్ టార్గెట్.

ఇప్పుడున్న షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు 98,35,394 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. దీని ద్వారా 251.79 కోట్ల రూపాయలను ఆర్జించగలిగింది ఇ-ముద్ర లిమిటెడ్ యాజమాన్యం. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం 48,37,336 ఈక్విటీలను కేటాయించింది. వారి కోసం నిర్దేశించిన ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 256 రూపాయలు. పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్.. రూ.243 నుంచి 256 రూపాయలుగా నిర్ధారించింది కంపెనీ యాజమాన్యం. లాట్ సైజు 58. బుకింగ్స్ ఫర్వాలేదనిపించుకున్నాయి. తొలి రోజు తొలి గంలోనే 19 శాతం మేర బిడ్స్ దాఖలయ్యాయి.
అదే దూకుడు కొనసాగింది. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ ఫుల్ సబ్‌స్క్రైబ్ అయింది. 1.13 కోట్ల షేర్లను కంపెనీ ఇష్యూ చేయగా.. 3.09 మంది ఇన్వెస్టర్లు బిడ్స్ వేశారు. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.61 మేర బిడ్స్ దాఖలయ్యాయి. నాన్ ఇన్‌స్టిట్యూటషన్ ఇన్వెస్టర్లు 1.28 సార్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 4.05 సార్లు బిడ్స్ వేశారు. కిందటి నెల 24వ తేదీన బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. 27వ తేదీన షేర్లు అలాట్‌మెంట్ అయ్యాయి. అలాట్‌మెంట్ దక్కని వారికి రీఫండ్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది. ఇవ్వాళ ఈ కంపెనీ షేర్లు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అవుతాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications