న్యూఢిల్లీ: ఆర్థికపరమైన నేరాలను అదుపు చేయడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. కొరడా ఝుళిపించింది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ షావోమి ఇండియాకు చెందిన ఆస్తులను సీజ్ చేసింది. ఈ ఆస్తుల విలువ 5,551.27 కోట్ల రూపాయలు. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు గుర్తించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న షావోమి కార్యాలయాలపై ఇదివరకే విస్తృతంగా తనిఖీలను నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షావోమి కార్యాలయాలపై ఈ దాడులు చేశారు. భారత్‌లో ప్రతి సంవత్సరం 34,000 కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపార కార్యకలాపాలను షావోమి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

2014 నుంచి భారత్‌లో షావోమి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భారత కంపెనీలతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల ప్రకారం.. మొబైల్ ఫోన్లు, విడి భాగాలు, ఇతర పరికరాలను ఇక్కడే తయారు చేయిస్తుందీ కంపెనీ. షావోమి మాతృదేశం చైనాతో వీటికి ఒప్పందం ఉంది. షావోమీ ఇండియాతో కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు. టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను షావోమి ఇండియా సమకూర్చదు. అయినప్పటికీ- మూడు విదేశీ సంస్థలకు షావోమీ ఇండియా భారీగా నగదును మళ్లించింది.
దీనికోసం తప్పుడు పత్రాలను ఆ కంపెనీ యాజమాన్యం సృష్టించింది. బ్యాంకులను సైతం తప్పుదోవ పట్టించింది. తప్పుడు సమాచారాన్ని అందజేసింది. దీన్ని ఫెమా ఉల్లంఘనగా గుర్తించారు అధికారులు. ఆ సంస్థ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్‌ను కూడా ఇటీవల ఈడీ విచారించింది కూడా. ఇప్పటికే వివిధ ఖాతాల నుంచి నగదును మళ్లించిన నేపథ్యంలో- షావోమి ఇండియా ఆ మిగిలిన మొత్తాన్ని కూడా అక్రమంగా చెల్లించే అవకాశం ఉందని ఈడీ అధికారులు భావించారు. ఈ కారణంతో 5,551 వేల కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications