అనిల్ అంబానీ ఆఫీసులపై ఈడీ దాడులు, రూ.3 వేల కోట్ల మనీ లాండరింగ్‌పై ఉక్కుపాదం
ED Raids Anil Ambani's Offices: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మనీ లాండరింగ్ కు సంబంధించి డిల్లీ, ముంబైలో ఈ దాడులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. 2017 నుండి 2019 మధ్య యెస్ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ. 3,000 కోట్లకు పైగా రుణాల అక్రమ మళ్లింపుపై ప్రాథమిక దర్యాప్తు అనంతరం.. అనిల్ అంబానీకి సంబంధించిన వ్యాపారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ భారీ సోదాలు నిర్వహించింది. ఈ దాడులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద చోటు చేసుకున్నాయి.
ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకులు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలను మోసం చేయడానికి వ్యూహాత్మకంగా రూపొందించబడిన స్కీములో ఈ నిధుల మళ్లింపు జరిగాయని వెల్లడించింది. యెస్ బ్యాంక్ ప్రమోటర్లు తమ స్వంత గ్రూప్ సంస్థలకు ముందుగానే నిధులు పంపినట్టు దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ దాడులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దాఖలు చేసిన FIRలతో పాటు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB), SEBI, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA), బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి నియంత్రణ సంస్థల ఇన్‌పుట్స్ ఆధారంగా జరిగినట్లు సమాచారం.

ఈ కేసులో కీలకంగా ఉన్న RAAGA గ్రూప్ కంపెనీలు (రిలయన్స్ ADA గ్రూప్‌లో భాగం) యెస్ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన విధానం పలు అనుమానాలకు తావిస్తోందని ఈడీ తెలిపింది. ఈ రుణాల కోసం అవసరమైన క్రెడిట్ విశ్లేషణ, రిస్క్ అసెస్మెంట్ వంటి ప్రాథమిక ప్రక్రియలు నిర్వహించకుండానే ఆమోదం జరిగిందని ఈడీ వెల్లడించింది. దీంతో పాటుగా పలు కంపెనీలు ఆర్థికంగా బలహీనంగా ఉండటం, ఒకే చిరునామా, డైరెక్టర్లను పంచుకోవడం, షెల్ కంపెనీలుగా ఉండటం వంటి అంశాలు ఈడీ దర్యాప్తులో వెలుగుచూశాయి.
కొన్ని కంపెనీలకు రుణాలు దరఖాస్తు చేసిన రోజునే విడుదలయ్యాయనడం.. అధికారిక ఆమోదాలకు ముందే డబ్బులు మంజూరయ్యాయని విషయాలు భారీ అవతతవకలను సూచిస్తున్నాయి. పాత రుణాలను తిరిగి చెల్లించేందుకు కొత్త రుణాలు మంజూరు చేసినట్టు ఆధారాలు లభించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. SEBI నివేదిక ప్రకారం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) ద్వారా మంజూరైన కార్పొరేట్ రుణాలు FY18లో రూ.3,742 కోట్ల నుండి FY19లో రూ. 8,670 కోట్లకు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విస్తృత రుణ లావాదేవీలపై ED ప్రస్తుతం విచారణ కొనసాగిస్తోంది. ఈ రోజు ఉదయం 50కి పైగా కంపెనీలతో పాటు 25 మందికి పైగా సంస్థకు చెందిన వ్యక్తులపై 35కు పైగా ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీ గ్రూప్, యెస్ బ్యాంక్ మధ్య సంబంధాలు, ఫండ్ల వాడకం పై ఆధారాల కోసం ఈ దాడులు నిర్వహించబడ్డాయి.
ఒకప్పుడు దేశంలోని అగ్రశ్రేణి ధనవంతులలో ఒకరైన అంబానీకి చెందిన అనేక కంపెనీలు ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్నాయి. ఇక ఎస్‌బిఐ.. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను అధినేత అనిల్ అంబానీని మోసగాడిగా ప్రకటించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల పార్లమెంటులో దీని గురించి సమాచారం ఇచ్చారు. ఆయన సభలో మాట్లాడుతూ.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అధినేత అనిల్ అంబానీని మోసగాడిగా ప్రకటించిందని తెలిపారు.SBI బ్యాంక్ ఇప్పుడు ఈ మోసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు ఫిర్యాదు చేయబోతోందని తెలిపారు.


Click it and Unblock the Notifications