రూ 5,500 బిల్లుకు రూ 1.45 లక్షల టిప్ ఇచ్చిన పెద్ద మనిషి: ఎక్కడో తెలుసా?

ప్రపంచమంతా ప్రతిరోజూ ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ కొన్ని వింతలే అందరికీ తెలుస్తాయి. ఎందుకంటే ఆ వింతకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి. ఇలాంటి వింతే ఒకటి ఇటీవల అమెరికాలో జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఒక సెలబ్రిటీ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఒక సాధారణ హోటల్ వెయిటర్ కు భారీ మొత్తంలో టిప్ చెల్లించి వార్తల్లో నిలిచారు. మనం అయితే టిప్ ఎంత చెల్లిస్తాం? ఒక రూ 1,000 బిల్లు అయితే, దాదాపు రూ 50 టిప్ గా చెల్లిస్తాం. అంటే సుమారు బిల్లు మొత్తంలో 5% టిప్ అన్నమాట.

కొన్ని దేశాల్లో టిప్ ను కూడా ఇంత మొత్తం చెల్లించాలని నిబంధనలు ఉంటాయి. కానీ అది తప్పనిసరేమీ కాదు. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో హోటల్ టిప్స్ అత్యధికంగా 15% వరకు ఉంటాయి. అంతకు మించి ఎవరూ టిప్ చెల్లించే అవకాశం ఉండదు. కానీ అమెరికా లో ఒక సెలబ్రిటీ మాత్రం దిమ్మ తిరిగే టిప్ చెల్లించారు. అది తెలిసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. కానీ అసలు విషయం తెలుసుకొని సెలబ్రిటీ పెద్ద మనసును వేనోళ్ళ పొగిడేస్తున్నారు.

2020 డాలర్ల టిప్...

అమెరికన్ నటుడు కం సింగర్ డోన్నీ వాల్బర్గ్ అనే పెద్ద మనిషి ఈ ఏడాది కొత్త సంవత్సరాన్ని ఎంతో సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. తన కుటుంబంతో కలిసి ఒక హోటల్ లో డిన్నర్ చేశారు. బిల్లు సుమారు 78 డాలర్లు (దాదాపు రూ 5,500 ) ఐంది. కానీ అయన బిల్లు మొత్తానికి 2020 డాలర్ల (సుమారు రూ 1.45 లక్షలు) టిప్ ను జోడించి చెల్లించారు. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. 2020 సంవత్సరాన్ని సూచించేలా అయన అంత మొత్తం టిప్ ను వెయిటర్ కు ఇచ్చారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న మంచి ఉద్దేశాన్ని అయన ఈ విధంగా చాటుకున్నారు. ఆ బిల్లు పై ఉన్న టిప్ మొత్తాన్ని చూసిన వెయిటర్ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు.

ట్విట్టర్ లో ప్రకటించిన అయన భార్య..

ట్విట్టర్ లో ప్రకటించిన అయన భార్య..

తన వంతుగా భారీ టిప్ చెల్లించిన డోన్నీ .... ఆ విషయాన్నీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అయన భార్య జెన్నీ కార్తీ మాత్రం తన ట్విట్టర్ వేదికగా తన భర్త పెద్ద మనసును ప్రపంచానికి చాటింది. తన భర్త 2020 ని ఘనంగా ప్రారంభించారని, గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అదే సమయంలో ట్విట్టర్ వేదికగా 2020 టిప్ ఛాలెంజ్ పేరుతొ హాష్ టాగ్ వేసి ఇతరులకు ఒక సవాలు విసిరారు. ఇక్కడ బిల్లును కూడా టాగ్ చేసారు. అందులో 78 డాలర్ల బిల్లు, 2020 డాలర్ల టిప్ చెల్లించినట్లు ఉంది. తమకు సర్వ్ చేసిన వెయిటర్ కు ధన్యవాదాలు తెలుపుతూ థాంక్స్ బేథాని... హ్యాపీ న్యూ ఇయర్. 2020 టిప్ ఛాలెంజ్ అని కూడా డోన్నీ బిల్లుపై రాశారు.

టిప్పుల వీరుడు...

టిప్పుల వీరుడు...

డోన్నీ ఇలా భారీ మొత్తం టిప్ ఇవ్వటం ఇదే తొలిసారి కాదట. 1999 లో వచ్చిన సిక్స్త్ సెన్స్ అనే సినిమాలోనూ నటించిన 50 ఏళ్ళ డోన్నీ ... న్యూ కిడ్స్ ఆన్ ది బ్లాక్ అనే సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2017 లో జులై కూడా డోన్నీ వాల్బర్గ్ ... 82 డాలర్ల బిల్లు కోసం 2000 డాలర్ల టిప్ చెల్లించారట. దాన్ని అయన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందుకు కారణాన్ని వివరించారట. తన తల్లి హోటల్ లో వెయిట్రెస్ గా, తన తండ్రి బార్ టెండర్ గా చాలా ఏళ్ళు పనిచేశారని... తాను హోటల్ కు వెళ్ళినప్పుడు అక్కడి వాలంటీర్లు తననొక మహారాజుల చూస్తారని చెప్పారు. అందుకే భారీ టిప్పులతో వారిని రాణులుగా చూడాలని వివరించటం కొసమెరుపు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+